ఇప్పుడు రోజా, ధర్మాన వంతు ! రంగంలోకి సీఐడీ 

ఏపీలో టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసిపి నేతలు( YCP Leaders ) పూర్తిగా టార్గెట్ అయ్యారు.

  ముఖ్యంగా గత వైసిపి ప్రభుత్వం లో కీలకంగా వ్యవహరించిన మంత్రులతో పాటు,  అదేపనిగా టిడిపిని, ఆ పార్టీ అధినేత చంద్రబాబు ,లోకేష్ ను టార్గెట్ చేసుకుని వ్యక్తిగత విమర్శలకు దిగిన వారందరి పైన అనేక కేసులు నమోదు అవుతన్నాయి.

గత వైసిపి ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతి వ్యవహారాలు,  వాటిలో భాగస్వామ్యం ఉన్న నేతలందరికి నోటీసులు అందడంతో పాటు,  విచారణలు చేయిస్తున్నారు.

అంతేకాదు అరెస్టుల పరంపర కూడా మొదలైంది.దీంతో ఏ క్షణంలో ఎవరు అరెస్ట్ అవుతారో తెలియని భయాందోళనలో వైసిపి నేతలు ఉన్నారు.

"""/" / ఇప్పటికే మాజీ మంత్రులు జోగి రమేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  కొడాలి నాని , వల్లమనేని వంశీ తో పాటు, అనేకమంది వైసీపీ నేతలు కేసులు ఎదుర్కొంటున్నారు.

తాజాగా ధర్మాన కృష్ణ దాస్,( Dharmana Krishna Das ) ఆర్కే రోజా పై( RK Roja ) ఫిర్యాదులు రావడంతో సిఐడి అధికారులు రంగంలోకి దిగారు.

ధర్మాన కృష్ణ దాస్ , రోజాలపై సిఐడి కి( CID ) ఫిర్యాదులు అందడంతో, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టేందుకు సిఐడి అధికారులు నిర్ణయించుకున్నారు.

  """/" / ముఖ్యంగా వైసిపి ప్రభుత్వం హయాంలో చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా భారీగా అవినీతికి పాల్పడ్డారని , నిధులను పక్కదారి పట్టించారని కబాడీ మాజీ క్రీడాకారుడు ఆర్డి ప్రసాద్ ,మాజీ మంత్రులు రోజా, ధర్మాన కృష్ణ దాస్ పై జూన్ లోని ఫిర్యాదు చేశారు.

ఆడుదాం ఆంధ్ర పై విచారణ జరిపి వాస్తవాలను నిగ్గు తేల్చాలని ఫిర్యాదులో పేర్కొన్నారు .

దీనిపై కేసు నమోదు చేయాలంటూ తాజాగా సిఐడి అధికారులు ఎన్టీఆర్ జిల్లా సిపిని ఆదేశించారు.

  దీంతో మాజీ మంత్రులు రోజా , ధర్మాన కృష్ణ దాస్ పై కేసులు నమోదు కానున్నాయి.

త్వరలోనే ఈ కేసు కు సంబంధించి ఈ  ఇద్దరు విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

అమెరికా కస్టడీలో అన్మోల్ బిష్ణోయ్.. భారత్‌కు రప్పించాలని కేంద్రం యత్నాలు