ఏపీ సీఐడీ అధికారులకు కోర్టులో చుక్కెదురు..!

ఏపీ సీఐడీ అధికారుల‌కు కోర్టులో చుక్కెదురైంది.ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టార‌న్న ఆరోప‌ణ‌ల‌పై సీఐడీ టీడీపీ కేంద్ర కార్యాల‌య మీడియా కో ఆర్డినేట‌ర్ దార‌ప‌నేని న‌రేంద్రను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆయనను జడ్జి ముందు హాజరుపరిచారు పోలీసులు.అయితే నరేంద్రను రిమాండ్‌కు పంపే విష‌యాన్ని సీఐడీ కోర్టు న్యాయ‌మూర్తి వాయిదా వేశారు.

న‌రేంద్రను వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం ముందుగా గుంటూరులోని జీజీహెచ్‌కు త‌ర‌లించాల‌ని, ఆరోగ్యంపై నివేదిక అందించాల‌ని వైద్యుల‌కు ఆదేశాలు జారీ చేశారు.

ఆ నివేదిక‌ను ప‌రిశీలించిన త‌ర్వాతే న‌రేంద్ర‌ను రిమాండ్‌కు పంపే విష‌యంపై నిర్ణ‌యం తీసుకుంటాన‌ని న్యాయ‌మూర్తి తెలిపారు.