నారా లోకేశ్ కు ఏపీ సీఐడీ నోటీసులు..!

టీడీపీ నేత నారా లోకేశ్ కు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది.

రెడ్ బుక్ అంశంలో లోకేశ్ కు వాట్సాప్ లో సీఐడీ అధికారులు నోటీసులు పంపారు.

అయితే రెడ్ బుక్ పేరుతో తమను లోకేశ్ బెదిరిస్తున్నారని సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు.

ఈ నేపథ్యంలో లోకేశ్ కు నోటీసులు ఇచ్చేందుకు సీఐడీకి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.

ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు వాట్సాప్ లో సీఐడీ అధికారులు లోకేశ్ కు నోటీసులు పంపించారు.

నోటీసు అందుకున్నట్లు వాట్సాప్ లో సీఐడీకి లోకేశ్ సమాధానం కూడా ఇచ్చారు.కాగా రెడ్ బుక్ వ్యవహారంపై తదుపరి విచారణను ఏసీబీ కోర్టు జనవరి 9వ తేదీకి వాయిదా వేసింది.

వీడియో వైరల్.. సీతమ్మ మెడలో తాళి కట్టిన ఎమ్మెల్యే.. ఆగ్రహిస్తున్న ప్రజలు