సోషల్ మీడియాలో చిన్నారుల అశ్లీల చిత్రాలపై ఏపీ సీఐడీ చర్యలు

సామాజిక మాధ్యమాల్లో పిల్లల అశ్లీల చిత్రాలపై ఏపీ సీఐడీ చర్యలకు సిద్ధమైంది.ఫేస్ బుక్, యూట్యూబ్, జీ మెయిల్ ద్వారా పిల్లల అశ్లీల చిత్రాలను అప్లోడ్ చేస్తున్నట్లు గుర్తించింది.

ఈ క్రమంలో నమోదైన ఓ కేసులో 12 మంది నిందితులున్నారు.కాగా ఈ అశ్లీల చిత్రాలను అప్ లోడ్ చేసిన వారు విజయవాడకు చెంది‌న వ్యక్తులుగా సీఐడీ అధికారులు గుర్తించారు.

సీఐడీ సమాచారంతో విజయవాడ సైబర్ క్రైం పోలీసులు రంగంలోకి దిగారు.ముగ్గురు మహిళలలో సహా 12 మందిపై కేసు నమోదు చేశారు.

మీకు ఇదేం సరదా రా బాబు.. కాస్త అటు ఇటు అయితే ప్రాణాలు గాల్లోకె..