శ్రీనివాసుడి సేవలో ఏపి ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి..

తిరుమల శ్రీవారిని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దర్శించుకున్నారు.నుదుట తిరునామం ధరించి, సాంప్రదాయ వస్త్రాలతో ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డికి టిటిడి చైర్మన్ వైవి.

సుబ్బారెడ్డి, టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి ఆలయ మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు.

స్వామి వారి దర్శనానంతరం శ్రీ వకుళా మాతను, ఆలయప్రదక్షిణగా వచ్చి శ్రీ విమాన వెంకటేశ్వర స్వామి వారిని, సబేరా, భాషకార్ల సన్నిధి, శ్రీ యోగి నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు.

శ్రీవారి దర్శనానంతరం ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.

అనంతరం తిరుమలలో నూతనంగా నిర్మించిన పరకామణి భవనం సీఎం ప్రారంభించారు.

GPS లేని రోజుల్లోనే 3D మ్యాప్.. పురాతన ఆవిష్కరణతో సైంటిస్టులే విస్తుపోయారు!