భారీ వర్షాలతో ఏపీ అల్లకల్లోలం..!

మిచాంగ్ తుపాను ప్రభావంతో ఏపీలో ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది.దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి.

తుపాను నేపథ్యంలో ఇప్పటికే అప్రమత్తమైన ప్రభుత్వం తుపాను ప్రభావిత జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించింది.

ఈ నేపథ్యంలో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తుపాను ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్నాయి.అలాగే సీఎం కార్యాలయం నుంచి ప్రత్యేక మానిటరింగ్ చేస్తున్నారు అధికారులు.

కాగా మిచాంగ్ తుపాన్ భయానకంగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది.నెల్లూరుకు 50 కిలోమీటర్లు, బాపట్లకు 110 కిలోమీటర్లు అలాగే మచిలీపట్నానికి 170 కిలోమీటర్ల దూరంలో తుపాన్ కేంద్రీకృతమైంది.

ఈ క్రమంలోనే ఇవాళ మధ్యాహ్నం నెల్లూరు - బాపట్ల మధ్య తీరం దాటే అవకాశం ఉంది.

గంటకు సుమారు ఏడు కిలో మీటర్ల వేగంతో పయనిస్తున్న మిచాంగ్ తీవ్ర తుపాన్ తీరాన్ని తాకే సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి.

తీరం వెంబడి వంద నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి22, బుధవారం 2025