పరిపాలన రాజధాని శంకుస్థాపన ఈ నెల 16న కాదు దసరాకే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న సీఆర్డీఏ రద్దు బిల్లు కు హైకోర్టు బ్రేక్ వేసింది.

దీనిపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఈ కేసుపై సత్వరమే విచారణ చేపట్టాలని తాజాగా సుప్రీం ధర్మాసనంకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ కూడా రాసింది.

ఇంకా దానిపై విచారణ మొదలవ్వకపోవడంతో విశాఖపట్నంలో ఈ నెల 16న జరగవలసి ఉన్న శంకుస్థాపనకు బ్రేక్ పడింది.

ఈ శంకుస్థాపనకు జగన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటెండ్ అవ్వాలని కోరారు.

మరి అలాంటి అంశం ఇక ఇప్పుడు కోర్టు కేసుల నేపథ్యంలో వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది.

"""/"/ ఇలాంటి టైంలో బ్రేక్ పడిన శంకుస్థాపన ఎప్పుడు జరుపుతారని ఏపీ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

ప్రస్తుతం ఉన్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏపీ ప్రభుత్వం ఈ శంకుస్థాపన కార్యాన్ని దసరాకి నిర్వహించాలని భావిస్తున్నట్టు దానికి తగ్గట్టు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే రాజధాని అంశంలో పెద్ద ఎత్తున అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రభస జరుగుతుంది.

మరి అలాంటి రాజధాని అంశం ప్రభుత్వం భావించినట్టు దసరా కైనా ఓ కొలిక్కి వస్తుందో లేదో వేచి చూడాలి.

భర్తతో దిగిన ఫోటోలను డిలీట్ చేయాలని కోరిన కత్రినా కైఫ్.. అసలేం జరిగిందంటే?