నేడు ఏపీ కేబినెట్ సమావేశం..!!

ఏపీ కేబినెట్ సమావేశం ఇవాళ జరగనుంది.ఈ మేరకు వెలగపూడిలోని సచివాలయంలో ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీకానుంది.

సీఎం జగన్( CM Jagan ) అధ్యక్షతన జరుగుతున్న ఈ మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ( Vote On Account Budget )తో పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చించనున్నారు.

ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో ఏమైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

అయితే ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. """/" / ఎన్నికలకు ముందు జరిగే చివరి సమావేశాలు కావడంతో కేబినెట్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది.

డీఎస్సీ నోటిఫికేషన్ ( DSC Notification )తో పాటు వైఎస్ఆర్ చేయూత ( YSR Cheyutha Scheme )నాలుగో విడతకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.

ఇంధన రంగంలో 22 వేల కోట్ల పెట్టుబడుluలతో పాటు ఎస్ఐపీబీ తీర్మానాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

రామ్ చరణ్ దర్గాకు వెళ్లడంపై తనికెళ్ల భరణి రియాక్షన్ ఇదే.. ఆయన ఏమన్నారంటే?