కాసేపటిలో ఏపీ కేబినెట్ సమావేశం

ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన మరి కాసేపటిలో కేబినెట్ సమావేశం జరగనుంది.

ఉద్యోగాల భర్తీతో పాటు సంక్షేమ పథకాలపై మంత్రివర్గం ప్రధానంగా చర్చించనుంది.అదేవిధంగా విశాఖపట్నంలో సీఎం కార్యాలయం, మంత్రుల వసతి వంటి పలు అంశాలపై కేబినెట్ లో చర్చించనున్నారని తెలుస్తోంది.

ఈమేరకు విశాఖలో అధికారిక నివాసాలు, కట్టడాలకు సంబంధించి త్రిమెన్ కమిటీ నివేదికపై మంత్రివర్గం చర్చించనుంది.

అలాగే భూ కేటాయింపులతో పాటు రాష్ట్రంలో కరువు పరిస్థితులపై కూడా చర్చలు జరిపే అవకాశం ఉంది.

ఈ క్రమంలో మంత్రివర్గ ఆమోదంతో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

వైరల్: కారును ఏకంగా ట్రాక్టర్‌లా మార్చేసిన కుర్రాడు!