మరికాసేపటిలో ఏపీ కేబినెట్ సమావేశం

ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది.ఈ మేరకు ఇవాళ ఉదయం 11 గంటలకు మంత్రివర్గం భేటీకానుంది.

ఇందులో భాగంగా పలు కీలక బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.రేపటి నుంచి ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.

ఈ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం జగన్ మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు.అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి జీపీఎస్ కు కేబినెట్ లో చర్చ జరగడంతో పాటు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

మరోవైపు చంద్రబాబు అరెస్ట్ తరువాత జరుగుతున్న సమావేశాలు కానుండటంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.అనంతరం టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో జరిగిన అక్రమాలపై సీఎం జగన్ రోజుకో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

ఆ సమయంలో జబర్దస్త్ నుంచి తీసేశారు.. తిరుపతి ప్రకాష్ ఎమోషనల్ కామెంట్స్!