ఏపీ కేబినెట్ సమావేశం.. పలు కీలక నిర్ణయాలు

ఏపీ కేబినెట్ మరికాసేపటిలో సమావేశం కానుంది.సీఎం జగన్ అధ్యక్షతన ఏర్పాటవుతున్న ఈ భేటీలో పలు అంశాలపై చర్చించి మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకోనుంది.

విశాఖలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్, మోడల్ స్కూళ్లపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.

ఎస్ఐపీబీ ఆమోదించిన ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.అదేవిధంగా ఆదర్శ పాఠశాలలతో పాటు విద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎడ్యుకేషన్ సొసైటీల్లోని ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచే విషయంపై చర్చించనున్నారని తెలుస్తోంది.

పీరియడ్స్ లో నొప్పులు భరించలేకపోతున్నారా.. అయితే ఇలా చేయండి!