వైసీపీ పై ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు సీరియస్ వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నాయి.వచ్చే ఎన్నికలలో వైసీపీ పార్టీని ఎలాగైనా గద్దె దించాలని తీవ్ర స్థాయిలో శ్రమిస్తున్నాయి.

ఈ క్రమంలో ప్రతిపక్షాల పార్టీలకు చెందిన నాయకులు నిత్యం ప్రజలలో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

ఈ రకంగానే ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ తాజాగా వైసీపీ ప్రభుత్వం పై మండిపడ్డారు.

ఏపీలో వైసీపీ పై రోజు రోజుకి ప్రజలలో వ్యతిరేకత పెరిగిపోతూ ఉందని విమర్శించారు.

"""/" /   రాష్ట్రంలో వైసీపీ పతనం ప్రారంభమైందని సంచలన వ్యాఖ్యలు చేశారు.శనివారం ఆళ్లగడ్డ కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ వేస్లీ తెనాలికి చెందిన షేక్ బాషా ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాకు చెందిన పలువురు బీఆర్ఎస్ లో జాయిన్ కావడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగతా పార్టీల మాదిరిగానే బీఆర్ఎస్ లో కూడా చాలామంది జాయిన్ అవుతున్నారు.

కేసీఆర్ పాలన పట్ల ఏపీలో ఆకర్షితులైన వాళ్ళు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ అన్ని స్థానాలలో పోటీ చేయబోతోంది.

ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీలో గత కొద్దిరోజుల నుండి ఏపీలో వివిధ ప్రాంతాల వాళ్ళు జాయిన్ కావడం విశేషం.

ఓరి నాయనో.. వీరెంత ఫాస్ట్‌గా ప్లేట్లు, కప్పులు, ఫుడ్ అందిస్తున్నారో చూస్తే..?