వీర్రాజు టీమ్ రెడీ ? ఆ నలుగురితో పరుగులే పరుగులు ?

బీజేపీని ఏపీలో పరుగులు పెట్టించడమే ఏకైక లక్ష్యంగా కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు ముందుకు వెళ్తున్న తీరుతో ఏపీలో బీజేపీ బాగా బలపడుతున్నట్టుగానే కనిపిస్తోంది.

ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీని టార్గెట్ గా చేసుకుని బీజేపీ విమర్శలు చేస్తూ, ఆ పార్టీని బలహీనం చేసే దిశగా ముందుకు వెళ్తోంది.

అయితే ఈ స్పీడ్ సరిపోదని, ఈ స్పీడు ను మరింతగా పెంచేందుకు సిద్ధమైన సోము వీర్రాజు తన కార్యవర్గాన్ని ప్రక్షాళన చేసేందుకు కసరత్తు మొదలు పెట్టారు.

ఈ నేపథ్యంలో కొత్త టీమ్ ఏర్పాటు చేసుకునేందుకు ఆయన కొన్ని పేర్లను కూడా ఫైనల్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ టీమ్ ఏర్పాటులో ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించారు.కొత్త కార్యవర్గంలో సామాజిక వర్గ సమీకరణలతో పాటు, ప్రాంతాలు, పార్టీ విధేయత ఇలా అన్ని విషయాల్లోనూ క్షుణ్ణంగా పరిశీలించి ఓ నలుగురు కీలక నాయకులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ వ్యవహారంపై పార్టీ హైకమాండ్ తో చర్చించి అనుమతి పొందినట్లు సమాచారం.

ఇక కొత్తగా నలుగురు ప్రధాన కార్యదర్శులుగా తీసుకోబోతున్న వారి వివరాలు పరిశీలిస్తే, రాయలసీమ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి, కోస్తా జిల్లాల నుంచి మాదిగ సామాజిక వర్గానికి చెందిన రావెల కిషోర్ బాబు, ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి బిసి సామాజిక వర్గానికి చెందిన పీవీఎన్ మాధవ్ , గోదావరి జిల్లాల నుంచి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన తురగా నాగభూషణంలను తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

"""/"/ వీరందరి రాజకీయ నేపథ్యం చూస్తే, ఒక్క రావెల కిషోర్ బాబు తప్పించి, మిగతా ముగ్గురు నాయకులు బీజేపీతో దశాబ్దాల అనుబంధం కలిగి ఉన్న వారే.

మొదటి నుంచి బీజేపీ భావజాలంతో మెలుగుతూ వస్తున్నవారే.ఇక వీరే కాకుండా, మరో పది మంది ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, ఒక కోశాధికారిని నియమించి, ఆ టీమ్ తో మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని సోము వీర్రాజు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే, ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సైతం కేంద్ర స్థాయిలో పార్టీ పదవి దక్కే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

మొత్తంగా చూస్తే ఈ విషయంలో బీజేపీ చాలా పకడ్బందీగానే వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తోంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే4, శనివారం 2024