మోదీ ఫోటో కోసం ఏపీ బిజేపి ఆరాటం ? మరి వాటి సంగతి ? 

మిత్రత్వం ఉన్నప్పుడు తప్పులు చేసిన ఒప్పు గానే కనబడుతుంది.అదే శత్రుత్వం మొదలైందో అప్పటి నుంచి ఆ తప్పులను వెతికే పని మొదలవుతుంది.

ప్రస్తుతం ఏపీలో బీజేపీ వైసిపి ప్రభుత్వం మధ్య వార్ మొదలైపోయింది.జగన్ ను పూర్తిస్థాయిలో ప్లాప్ చేసేందుకు బిజెపి కంకణం కట్టుకుంది.

ఏదో ఒక అంశంపై ఏపీ ప్రభుత్వ తీరును తప్పుపడుతూ పోరాటాలు చేస్తూ ఉంటే, బిజెపి గ్రాఫ్ క్రమక్రమంగా పెరుగుతుందనే లెక్కల్లో ఏపీ బీజేపీ నాయకులు ఉన్నారు.

అందుకే వివిధ సమస్యలపై ఇప్పటి వరకు పోరాటం చేస్తూ వచ్చినా, ఆ పార్టీ నాయకులు ఇప్పుడే వేరే రూట్ లో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

కేంద్రం అమలు చేస్తున్న పథకాల విషయంపై దృష్టి పెట్టారు.వాటిని ఏపీ ప్రభుత్వం తాము అమలు చేస్తున్న పథకాలుగా గొప్పగా చెప్పుకుంటూ ప్రచారం పొందుతున్న తీరుని ఇప్పుడు తీరిగ్గా ఏపీ బీజేపీ నాయకులు తప్పుపడుతున్నారు.

అంతేకాదు కేంద్రం పథకాల అమలులో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో కనిపించకపోవడం పై ఆరా తీస్తున్నారు.

కేంద్రం అమలు చేస్తున్న పథకాలను ఏపీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోకపోవడం, శిలాఫలకాలలో పేరు లేకపోవడం, కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల నిమిత్తం పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తున్నా, ఆ విషయాలను పట్టించుకోకపోవడం వీటన్నిటినీ ఇప్పుడు ఏపీ బీజేపీ నాయకులు హైలెట్ చేస్తున్నారు.

"""/"/ ఫలితంగా వైసిపి ప్రభుత్వం గొప్పగా ప్రభుత్వ పథకాలను అమలు చేయడం లేదని, కేంద్రం ఇస్తున్న పథకాలకు పేర్లు మార్చి అమలు చేస్తోందని,  ఇందులో జగన్ గొప్పదనం ఏమీ లేదు అంటూ చెప్పుకునే ప్రయత్నం మొదలు పెట్టింది.

అయితే వైసీపీ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడం ద్వారా,  బీజేపీ కి ఏదైనా కలిసి వస్తుందా అంటే అది అనుమానమే.

ఏపీ ప్రభుత్వం పై పెరిగిన వ్యతిరేకత టిడిపి జనసేన పార్టీ లకు కలిసివచ్చినా, బిజెపికి ఏపీలో అంతగా మైలేజ్ తీసుకు రాదనేది విశ్లేషకుల అభిప్రాయం.

ఎందుకంటే దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న ధరలు ద్ర వ్యోల్బణం అదుపు లేకపోవడం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, పోలవరం ప్రాజెక్టు, ఏపీకి ప్రత్యేక హోదా, మిగతా ప్రభుత్వరంగ ఆస్తులను ప్రైవేటీకరించే ప్రయత్నాలు చేయడం,  ఇలా ఎన్నో అంశాలు బీజేపీకి ఇబ్బందికరంగా మారాయి.

ఏపీ బీజేపీ బలం పెంచుకుందామని ఎంతగా ప్రయత్నాలు చేసినా, ఇవన్నీ బీజేపీ గ్రాఫ్ పెరగకుండా చేస్తున్నాయి.

స్కూల్‌కు లేటుగా వచ్చిందని టీచర్‌ను చావబాదిన ప్రిన్సిపాల్.. వీడియో వైరల్..