కేంద్ర మంత్రితో భేటీ అయిన ఏపీ బీజేపీ నేతలు..!!

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం నడుస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎక్కడా తగ్గడం లేదు.

నువ్వానేనా అన్నట్టుగా రెండు అధికార ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉండటంతో మరోపక్క ప్రతిపక్షాలు.ఇదంతా పొలిటికల్ మైలేజీ కోసం ఆడుతున్న డ్రామా అంటూ ఆరోపణలు చేస్తూ ఉన్నాయి.

ఇటువంటి తరుణంలో ఏపీ బీజేపీ నేతలు తాజాగా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షేకవత్ తో భేటీ అయ్యారు.

"""/" / పోలవరం సహా.ముప్పు ప్రాంతాలకు సంబంధించి వివరాలను ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు కేంద్ర మంత్రికి వివరించారు.

ఆర్ఆర్ ప్యాకేజీ కి సంబంధించి పోలవరం ముంపు ప్రాంతాల బాధితులకు సాయం అందలేదని తెలిపారు.

ఇదే తరుణంలో కృష్ణ, గోదావరి మేనేజ్మెంట్ బోర్డ్ లకి సంబంధించి రాయలసీమ ప్రాంతంలో ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఇంకా పలు విషయాలపై చర్చించినట్లు తెలిపారు.

అదే రీతిలో వెలిగొండ ప్రాజెక్టు లో జరిగిన అవకతవకలు కూడా బోర్డు పరిధిలోకి తీసుకొచ్చారు వీధిలో కేంద్రమంత్రి ఆలోచన చేసినట్లు ఏపీ బీజేపీ నేతలు మంత్రితో భేటీ అయిన తర్వాత మీడియా సమావేశంలో తెలిపారు.

తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో విజయం..: మాజీ గవర్నర్ తమిళిసై