AP BJP : రెండు రోజులపాటు ఏపీ బీజేపీ ముఖ్యనేతల భేటీ..!!

ఏపీలో బీజేపీ( AP BJP ) ముఖ్యనేతలు కీలక సమావేశాలు నిర్వహించనున్నారు.ఈ మేరకు రేపు, ఎల్లుండి కాషాయ నేతలు భేటీ కానున్నారు.

కోర్ కమిటీ నాయకులతో పాటు జిల్లాల నుంచి ముఖ్యమైన నేతలకు పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే ఆహ్వానాలు పంపిందని తెలుస్తోంది.

అదేవిధంగా ఈ సమావేశాలకు జాతీయ సహ సంఘటనా ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ జీ( Shiv Prakash ) హాజరుకానున్నారు.

"""/" / రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాంతో పాటు పొత్తులపై ప్రధానంగా నేతలు చర్చించే అవకాశం ఉందని సమాచారం.

ఈ క్రమంలోనే మరో వారం రోజుల్లో ఏపీలో పొత్తులపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని రాష్ట్ర బీజేపీ నేతలు భావిస్తున్నారని తెలుస్తోంది.