జూనియర్ ఎన్టీఆర్ పై సోము వీర్రాజు ప్రశంసలు
TeluguStop.com
జూనియర్ ఎన్టీఆర్ కు శాస్త్రీయ న్రుత్య అభినయనం మీద మంచి పట్టు ఉంది అంటూ జూనియర్ ఎన్టీఆర్ నటన పై మరోసారి ఏపీ బిజెపి అధ్యక్షుడు సోమువీర్రాజు ప్రశంశాస్త్రాలు సంధిస్తూ పలువ్యాఖ్యలు చేశారు.
విజయవాడలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి టీచర్స్ సెల్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం సెల్ కో కన్వీనర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ గురు పూజోత్సవం కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన చేశారు.
కార్యక్రమంలో నృత్యం చేసిన చిన్నారి గురించి ప్రస్తావిస్తూ జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పిన సోము వీర్రాజు.
జూనియర్ ఎన్టీఆర్ చక్కటి నటుడు.భరత నాట్యాన్ని అభ్యసించాడు.
బాల రామాయణంతో జూనియర్ ఎన్టీఆర్ తొలి సినిమా.భారత నాట్యంలో ముద్ర, అంగీకం, భంగిమలు వంటివి జూనియర్ ఎన్టీఆర్ కు బాగా తెలుసు.
కళాకారుల గురించి నేను పెద్దగా చెప్పలేనన్నారు.జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తెస్తే అందరికీ అర్థమవుతుందని చెప్పానన్నారు.
జగన్ అధికారంలోకి రాగానే సిపియస్ రద్దు చేస్తానని మాట తప్పారు.ఒట్లేసిన పాపానికి ఉపాధ్యాయులతో పాటు వారి కుటుంబ సభ్యులపైన కేసులు పెడుతున్నారు.
ఉపాధ్యాయుల సేవల్ని ప్రభుత్వం ఉపయోగించుకొని మోసం చేసింది.151మంది ఎమ్మేల్యేలను గెలిపిస్తే మోసం చేసారు.
ఉపాద్యాయులు కూడా ప్రత్యామ్నాయానికి మద్దతుగా ఉండాలి.ఉపాద్యాయుల పట్ల ప్రభుత్వం బాధ్యతగా ఉండాలి.
అమలు కానీ హామీలు ఇవ్వటం ఎందుకు ఇప్పుడు చేయలేము అని చెప్పడం దేనికి.
అని ప్రశ్నించారు బిజెపి జిల్లా అధ్యక్షుడు బబ్బూరి శ్రీరామ్, గోళ్ల ఆదినారాయణ రావు తదితరులు మాట్లాడారు.
అనంతరం ఉపాధ్యాయులను గురుబ్రహ్మలుగా పురస్కారాలు ఇచ్చి 16 మందిని సత్కరించారు.ఈ సందర్భంగా గురువులు సమాజానికి చేసిన సేవలు పలువురు ప్రస్తావించారు.