వైసీపీ కాదు టీడీపీనే ఇప్పుడు ఏపీ బీజేపీ టార్గెట్ ?

ఏపీలో రాజకీయ అడుగులు ఏ విధంగా వేయాలి అనే విషయంలో బిజెపి కాస్త కంగారు పడుతున్నట్టుగానే కనిపిస్తోంది.

2014 ఎన్నికల సమయంలో టిడిపి తో పొత్తు పెట్టుకుని బిజెపి కొన్ని స్థానాల్లో గెలుపొందింది.

అయితే ఆ పొత్తు కొంతకాలానికి రద్దయి పోవడం,  బిజెపిని టార్గెట్ చేసుకుని టిడిపి విమర్శలు చేయడం,  అలాగే టిడిపిని ఇరుకున పెట్టే విధంగా బిజెపి వ్యవహరించడం వంటివన్నీ జరిగాయి.

ఇక 2019 ఎన్నికల సమయానికి ముందు వరకు బిజెపి అగ్ర నేతలను సైతం టార్గెట్ చేసుకుంటూ చంద్రబాబు పెద్ద ఎత్తున విమర్శలు చేసేవారు.

అంతేకాకుండా తిరుపతి వచ్చిన సందర్భంగా బిజెపి అగ్రనేత అమిత్ షా కారుపై రాళ్లు వేసిన ఘటన వంటివి అప్పట్లో పెద్ద సంచలనమే రేపాయి.

2019 ఎన్నికల సమయంలో బిజెపితో పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించినా,  గతంలో చోటు చేసుకున్న సంఘటన కారణంగా దూరం పెట్టారు.

ఇక ఎన్నికల ఫలితాలు అనంతరం టిడిపిని టార్గెట్ చేసుకుంటూ బిజెపి విమర్శలు చేయడంతో,  వైసిపి - బిజెపి మధ్య ఒక పరోక్షమైన పొత్తు కొనసాగుతుందని , అందుకే టిడిపిని టార్గెట్ చేసుకున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగడం వంటి కారణాలతో టిడిపి విషయాన్ని పక్కన పెట్టి వైసిపి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ బిజెపి నేతలు వ్యవహరించారు.

అమరావతి విషయంలోనూ మొదట్లో వ్యతిరేకత చూపించినా,  ఆ తర్వాత సానుకూలంగా స్పందిస్తూ చంద్రబాబును  పొగిడేందుకు ప్రయత్నించారు.

చంద్రబాబుపై ఎప్పుడు విమర్శలు చేసే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం అమరావతి విషయంలో చంద్రబాబు గొప్పతనాన్ని మెచ్చుకున్నారు.

  అయితే గత కొద్ది రోజులుగా చూస్తే వైసీపీ విషయాన్ని పక్కన పెట్టి టీడీపీని మళ్లీ బిజెపి టార్గెట్ చేసుకున్నట్టుగానే కనిపిస్తోంది.

"""/"/తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చంద్రబాబు పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు ప్రధాని మోడీ ఫోటోను గాడిదకు తగిలించి ఎమ్మెల్యేలతో చెప్పులతో కొట్టించారని గుర్తు చేశారు.

పోరుబాట కార్యక్రమంలో విజయనగరంలో నిన్న ఏర్పాటుచేసిన సభలో మాట్లాడిన ఆయన బిజెపి వల్ల విశాఖకు రైల్వే జోన్ వచ్చిందని, ప్రధానులను మార్చానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు రైల్వే జోన్ ఎందుకు తేలేకపోయారని వీర్రాజు ప్రశ్నించారు.

చంద్రబాబు తీరుతోనే రాష్ట్రం అనుకున్నంత స్థాయిలో అభివృద్ధి చెందలేదని,  రాజధానికి ఇచ్చిన దాదాపు 7వేల కోట్లను సింగపూర్ చైనా ప్లాన్లు అంటూ మాయం చేశారని వీర్రాజు మండిపడ్డారు.

ప్రస్తుతం బిజెపి వ్యవహారం చూస్తుంటే ఎన్నికల వరకు ఇదేవిధంగా టిడిపిని టార్గెట్ చేసుకుని గతంలో చోటు చేసుకున్న సంఘటనను గుర్తు చేస్తూ ఇరుకున పెట్టే ప్రయత్నం చేయబోతున్నట్లుగా అర్థమవుతుంది.

అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ బదిలీ వేటు