సర్పంచ్ లకు న్యాయం చేయాలని గవర్నర్ ను కోరాం – పురంధేశ్వరి
TeluguStop.com
విజయవాడ: గవర్నర్ ఎస్ అభ్ధుల్ నజీర్ ను కలిసిన బిజెపి ఎపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, బిజెపి నేతలు జివిల్, విష్ణువర్ధన్ రెడ్డి.
పంచాయితీ నిధులు దారి మళ్లింపు, అపరిమితంగా చేస్తున్న అప్పుల పై ఫిర్యాదు.Ap బీజేపీ చీఫ్ పురంధేశ్వరి.
గ్రామ పంచాయతీలకు 14, 15 వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది.
పార్టీలకతీతంగా సర్పంచ్ ల కోసం మద్దతు పలుకుతున్నారు.7600 కోట్ల నిధులు రాక గ్రామీణాభివృద్ధి కుంటుపడిపోయింది.
అప్పులు తీసుకొచ్చి గ్రామాల్లో పనులు చేసిన సర్పంచ్ లు ఆత్మహత్య లు చేసుకున్నారు.
చిన్న కాంట్రాక్టర్లు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు.సర్పంచ్ లకు న్యాయం చేయాలని గవర్నర్ ను కోరాం.
నాలుగేళ్లలో 7.44 లక్షల కోట్ల అప్పులు చేశారు.
FRBM పరిధిలోకి రానీయకుండా రాష్ట్రం అప్పులు తెచ్చింది.బెవేరేజెస్ కార్పోరేషన్ ద్వారా అప్పులు తెచ్చారు.
నాణ్యత లేని మద్యం అందిస్తూ కుటుంబాలు నాశనం చేస్తున్నారు.గవర్నర్ ఈ అంశాలపై దృష్టి సారిస్తారని అనుకుంటున్నాం.
ఈ ఉదయం మరింత పై స్థాయికి తీసుకెళ్తాము.
అంత్యోదయ ఎక్స్‌ప్రెస్‌లో బీభత్సం.. ప్రయాణికుల ఆగ్రహంతో అద్దాలు ధ్వంసం!