వైసీపీ పాలనలో రాష్ట్రానికి కొత్తగా ఒక పరిశ్రమ వచ్చిందా – పురంధేశ్వరి

గుంటూరు: బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పాయింట్స్.ఏపీకి కేంద్రం ఏమీ చేయలేదని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు.

అత్యధిక ఇళ్లు ఏపీకి కేంద్రం కేటాయించింది.ఒక్కో ఇంటికి లక్షా 80 వేలు డబ్బులు కేంద్రం ఇస్తుంది.

రాష్ట్రంలో నిర్మించిన ఇళ్లపై వైకాపా ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలి.రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలు మంజూరు చేసి ప్రారంభించాం.

రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇచ్చి నిర్మించే వరకూ తాత్కాలిక భవనాల్లో తరగతులు నిర్వహిస్తున్నారు.

ఎన్నోప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఏపీలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలలకు సగం నిధులు కేంద్రం ఇస్తోంది.

గురజాల వైద్య కళాశాల పనులు చివరి దశకు చేరుకున్నాయి.విజయవాడ బైపాస్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

రాష్ట్రంలో జాతీయ రహదారులు అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి.రైల్వే అనుసంధానం లో భాగంగా కొత్త లైన్ల నిర్మాణం, డబ్లింగ్, విద్యుదీకరణపనులు చేపట్టింది.

అమరావతి ని స్మార్ట్ సిటీగా ప్రకటించి రెండు వేల కోట్లకు పైగా నిధులు కేటాయించాం.

రాజధానిగా అమరావతికి కేంద్రం కట్టుబడి ఉందని ప్రత్యేకంగా చెబుతున్నా.రాష్ట్రానికి సుదీర్ఘ తీర రేఖ ఉన్నా ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవటం లేదు.

కనీసం మత్స్యకారులకు అవసరమైన సహకారం కూడా ఇవ్వటం లేదు.చీరాలలో కిరణ్ అనే దలితుడిని, బాపట్ల జిల్లాలో బీసీ విద్యార్థిని ఎలా చంపారో చూశాం.

రాష్ట్రంలో దళితులు, వెనుకబడిన వర్గాల పై రోజూ దాడులు జరుగుతున్నాయి.వైసీపీ పాలనలో రాష్ట్రానికి కొత్తగా ఒక పరిశ్రమ వచ్చిందా.

రాష్ట్రంలో వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా ఇసుక మైనింగ్ చేస్తున్నారు.గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు కొట్టుకపోయినా పట్టించుకోలేదు.

ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పేరు మార్పు తో ప్రభుత్వం ఏం సాధించింది.

రాష్ట్రంలో కొత్తగా వచ్చిన ఐదు వైద్య కళాశాలల్లో పేమెంట్ సీట్లు పెట్టి అమ్ముకోవటానికి యత్నాలు చేస్తున్నారు.

విద్యుత్ చార్జీలు రకరకాలగా భారం మోపుతున్నారు.వైకాపా ప్రభుత్వం పేదలకు రావాల్సిన నిధులను దోచుకుంటున్నారు.

ఆయుష్మాన్ భారత్ వద్దని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది.ఆర్ 5 జోన్లో ఇళ్ల నిర్మాణం విషయంలో పేదలు, అమరావతి రైతులు ఇద్దరికీ న్యాయం జరగాలి.

పొత్తుల విషయం మా అగ్ర నాయకత్వం నిర్ణయిస్తుంది.రాష్ట్రంలో దొంగ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం.

బియ్యం ఎగుమతులపై కేంద్రం పరిస్థితులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుంది.వచ్చే నెల 10వ తేదిన సర్పంచ్ ల సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం.

వారి సమస్యలపై బిజెపి గళం వినిపిస్తాం.

మర్డర్ చేస్తానని అమెరికా అమ్మాయి వార్నింగ్.. వణికిపోయిన తనికెళ్ల భరణి.?