నేటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. అస్త్రాలు రెడీనా ?

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు( AP Assembly Meetings ) ప్రారంభం కానున్నాయి.

ఈరోజు నుంచి ఐదు రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి.ఈనెలఖరితో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు ముగుస్తుండడంతో, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు కొత్త ప్రభుత్వం సిద్ధమవుతోంది.

గవర్నర్ ప్రసంగంతో ఈరోజు అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయి .ఆ తర్వాత గవర్నర్ ప్రసంగం పై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెడతారు.

  సభలో దీనిపైన చర్చిస్తారు.ఈసారి జరిగే అసెంబ్లీ సమావేశాలు రాజకీయంగా ఆసక్తి నెలకొంది.

ఏపీలో వైసీపీ( YCP ) ఘోరంగా ఓటమి చెందడం,  కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో ప్రతిపక్ష హోదాను కూడా వైసిపి దక్కించుకోలేకపోయింది .

దీంతో ఈ సమావేశాలకు వైసీపీ అధినేత జగన్ హాజరవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

సభలో టిడిపి,  జనసేన , బిజెపి( TDP, Jana Sena, BJP ) కూటమి సభ్యులే ఎక్కువగా ఉండడం, ప్రతిపక్ష హోదా కూడా వైసిపికి లేకపోవడంతో , ఈ సభకు హాజరైనా అన్ని రకాలుగా తనను అవమానిస్తారనే అంచనాలో జగన్ ఉన్నారు.

దీంతో జగన్ ఈ సమావేశాలకు హాజరవుతారా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు .

"""/" / జగన్( YS Jagan Mohan Reddy ) అసెంబ్లీకి హాజరైనా సాధారణ ఎమ్మెల్యే గానే చూస్తారు.

దీంతో ఆయన సభకు హాజరు కావడంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదట .

అయితే మిగిలిన సభ్యులు మాత్రం సభకు హాజరై అధికార పార్టీని నిలదీయాలని నిర్ణయించుకున్నారు .

ఎన్నికల సమయంలో టిడిపి కూటమి ఇచ్చిన హామీలు అమలు చేయడంలో జరుగుతున్న ఆలస్యం పైన అధికార పార్టీని నిలదీయాలని నిర్ణయించుకున్నారు.

ఈనెల 24న ఢిల్లీలో ధర్నా ఉండడంతో ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరై వాకవూట్ చేసి వెళ్లే అవకాశం ఉన్నట్లుగా వైసిపి వర్గాలు పేర్కొంటున్నాయి.

  ఏపీలో అదుపుతప్పిన శాంతి భద్రతలు , దాడులు,  కూల్చివేతలు వంటి అంశాల పైన కూడా వైసిపి ఎమ్మెల్యేలు నిలదీయాలని నిర్ణయించుకున్నారు.

  గవర్నర్ ప్రసంగం మొదలవగానే నిరసన తెలపాలని వైసిపి నిర్ణయించుకుంది. """/" /   గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుని సభ నుంచి బయటకు వెళ్లేందుకు వైసిపి ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం.

అయితే వైసిపి నేతలు తమను ఏ ప్రశ్నలు అడిగినా వాటికి సమాధానం చెబుతామని అధికార పార్టీ ఇప్పటికే సవాల్ విసిరింది.

ఏపీ వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎవరు హత్యకు గురయ్యారు,  వాటిలో టిడిపి నేతలు ఎంతమంది ఉన్నారు అనే విషయాల పైన చర్చకు సిద్ధమని అధికార పార్టీ సవాల్ విసిరింది.

ప్రస్తుతం ఏపీలో సంక్షేమ పథకాలు అమలు కావడానికి జరుగుతున్న ఆలస్యానికి గత వైసీపీ ప్రభుత్వమే కారణమని ఇప్పటికే టిడిపి కూటమి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో , సభలోనే వైసీపీని మరింత ఇరుకున పెట్టే విధంగా కూటమి పార్టీలు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి.

గ్లిజరిన్ లేకుండానే కన్నీళ్లు కార్చగల టాలెంటెడ్ యాక్టర్లు.. ఎవరంటే..