రుణాంధ్రప్రదేశ్ గా ఏపీ..: కాంగ్రెస్ నేత తులసిరెడ్డి
TeluguStop.com
ఏపీ రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్ గా మార్చారని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు.ఏపీ అంతా మాఫియా రాజ్యంగా మారిందని విమర్శించారు.
కేంద్రంలో బీజేపీని, ఏపీలో వైసీపీని దించి కాంగ్రెస్ అధికారంలోకి రావాలని తెలిపారు.బీజేపీ, వైసీపీ ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తూ దోచుకుంటున్నాయని తులసిరెడ్డి ఆరోపించారు.
కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే జమ్మలమడుగు ఎమ్మెల్యే సీటు, కడప ఎంపీ సీటు కాంగ్రెస్ గెలవాలని తులసి రెడ్డి సూచించారు.
ఈ మేరకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రజలకు మంచి జరుగుతుందని వెల్లడించారు.