న్యూస్ రౌండప్ టాప్ 20 

1.ఏపీ లో 'మిచాంగ్ ' తుఫాన్ తీవ్ర ప్రభావం """/" / ' మీచాంగ్ ' తుఫాన్( Typhoon Meechang ) తీవ్ర తుఫాన్ గా మారింది.

గంటకు 8 కి.మీ.

వేగంతో  ఏపీ వైపు దూసుకు వస్తోంది అని ఐఎండి డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహా పాత్ర తెలిపారు.

2.తుఫాను ఎఫెక్ట్ : ప్రత్యేక అధికారుల నియామకం తుఫాను ప్రభావితం జిల్లాలకు ప్రత్యేక అధికారులను ఏపీ ప్రభుత్వం నియమించింది.

3.తుఫాన్ ఎఫెక్ట్ : పలు రైళ్లు రద్దు మిచౌంగ్ తుఫాను కారణంగా పలు రైళ్లు రద్దు అయ్యాయి.

దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.సుమారు 150 రైళ్లు రద్దు అయినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

4.తెలంగాణ ఫలితాలపై అల్లు అరవింద్ కామెంట్స్ """/" / తెలంగాణ కాంగ్రెస్ విజయంపై సినీ నిర్మాత అల్లు అరవింద్( Film Producer Allu Aravind ) స్పందించారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం సంతోషంగా ఉందని,  సినీ పరిశ్రమను ఆడుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వం కు కొత్త కాదు అని అల్లు అరవింద్ అన్నారు.

5.రేవంత్ రెడ్డిని అభినందిస్తూ ఏపీలో ఫ్లెక్సీ లు """/" / తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది.

రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ని అభినందిస్తూ విజయవాడలో భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి.

6.తుఫానుపై చంద్రబాబు కామెంట్స్ తుఫాన్ సహాయక చర్యలకు ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.

7.సుప్రీం కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ """/" / ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం కానుంది .

సండ్ర వెంకట వీరయ్య,  రేవంత్ రెడ్డి  ఇప్పటికే పిటిషన్ లు దాఖలు చేశారు.

పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లుధ్రా హాజరయ్యారు.8.

మెదక్ లో కూలిన శిక్షణ విమానం మెదక్ జిల్లాలోని తుఫాన్ శివారులోని టాటా కాఫీ పరిశ్రమ సమీపంలో శిక్షణ విమానం కూలింది.

భారీగా మంటలు చెలరేగడంతో విమానం పూర్తిగా దగ్ధమైంది.ఈ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు సజీవ దహనం అయ్యారు.

9.వీహెచ్ సంచలన కామెంట్స్ """/" / కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరు అనేదానిపై ఆ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు సంచలన కామెంట్స్ చేశారు.

అధిష్టానం దీనిపై నిర్ణయం తీసుకుంటుంది అని విహెచ్ అన్నారు.10.

యువగళ పాదయాత్రకు బ్రేక్ """/" / టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) యువ గళం పాదయాత్రకు బ్రేక్ పడింది .

భారీ వర్షాలు కారణంగా యాత్రను నిలిపివేశారు.11.

శ్రీశైలం ఆలయానికి పోటెత్తిన భక్తులు కార్తీక మాసం మూడో సోమవారం కావడంతో శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.

12.పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం """/" / నేటి నుంచి ఈనెల 22 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలయ్యాయి.

13.నాలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో  ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించి నకిలీ కరెన్సీ తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్నారు.

మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్,  కర్ణాటక,  బీహార్ లో సోదాలు నిర్వహించారు.14.

సిపిఐ నారాయణ సంచలన కామెంట్స్ """/" / కమ్యూనిస్టు పార్టీ అంటే కాంట్రవర్సరీ పార్టీ అని ఏ వివాదమైన కొట్లాటకైన దిగి ముందుండి సమస్యను పరిష్కరించుకోవాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ( Narayana ) అన్నారు.

15.తెలంగాణ తీర్పే ఏపీలోనూ రాబోయే ఎన్నికల్లో ఏపీలోనూ తెలంగాణలో వలె ప్రజల తీర్పు ఉంటుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ అన్నారు.

16.తెలంగాణ ప్రజల తీర్పు అభినందనీయం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం అభినందనీయమని కాంగ్రెస్ ఓకే కమిటీ సభ్యుడు రఘువీరారెడ్డి అన్నారు.

17.గవర్నర్ కు వైద్య పరీక్షలు """/" / గుంటూరు జిల్లా తాడేపల్లి లోని మణిపాల్ వైద్యశాలలో ఏపీ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ( AP Governor S Abdul Nazir )వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

18.ఏపీకి సాయం పై ప్రధాని హామీ మీచౌంగ్ తుఫాన్ నేపథ్యంలో  ఏపీకి అన్ని రకాల సహాయాన్ని అందిస్తామని ప్రధానికి నరేంద్ర మోడీ( Narendra Modi ) హామీ ఇచ్చారు .

తుఫాను సహాయక సమీక్షలో భాగంగా ఏపీలో తుఫాను సహాయం చర్యలపై ప్రధాని ఆరా తీశారు.

ఏపీ సీఎం జగన్ తో ప్రధాని ఫోన్ లో మాట్లాడారు.19.

స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్యూరో ఓఏస్ది  రాజీనామా """/" / తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఓ ఎస్ డి గా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రభాకర్ రావు రాజీనామా చేశారు.

20.కేటీఆర్ కామెంట్స్ తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటామని మంత్రి కేటీఆర్ అన్నారు.

ఢిల్లీలో చంద్రబాబు ..  బిజీ బిజీ