న్యూస్ రౌండప్ టాప్ 20
TeluguStop.com
H3 Class=subheader-style1.కాపులపై 'కన్నా ' కామెంట్స్/h3p """/" /
ఎన్నికల సమయంలోనే ఓట్ల అవసరం కాబట్టి కాపులను వాడుకుంటారని ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
H3 Class=subheader-style2.కేసీఆర్ పై రేవంత్ రెడ్డి విమర్శలు/h3p
తెలంగాణ సీఎం కేసీఆర్ పవర్ ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతున్నారు అని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు.
H3 Class=subheader-style3.కేటీఆర్ కు రేవంత్ సవాల్/h3p """/" /
మంత్రి కేటీఆర్ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కి మధ్య మాటలు యుద్ధం కొనసాగుతోంది.
భూ కబ్జాలపై అసెంబ్లీలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ విమర్శలు చేస్తున్నారు.కేటీఆర్ తన ఆస్తుల పై సిట్టింగ్ జడ్జి విచారణకు సిద్ధమా అని రేవంత్ సవాల్ చేశారు.
H3 Class=subheader-style4.వివేకా హత్య కేసు పై పుస్తకం విడుదల/h3p
ఏపీ సీఎం జగన్ చిన్నాన్న , మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి అసలు ఆ రోజు ఏం జరిగిందనే విషయం పై తాజాగా టీడీపీ ఓ బుక్ ను విడుదల చేసింది.
H3 Class=subheader-style5.ప్రగతి భవన్ కు వెళ్లిన రాజసింగ్ .
అరెస్ట్/h3p """/" /
గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ తనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కందిటిషన్ పై ఫిర్యాదు చేసేందుకు ప్రగతి భవన్ కు వెళ్లారు.
ఈ సందర్భంగా రాజసింగ్ ను పోలీసులు అడ్డుకోవడంతో, తన వెంట తీసుకువచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ప్రగతి భవన్ ముందు వదిలేసి వెళ్లారు.
దీంతో పోలీసులు వెంటనే రాజాసింగ్ అడ్డుకుని అరెస్టు చేశారు.h3 Class=subheader-style6.
కాంగ్రెస్ పై హరీష్ రావు కామెంట్స్/h3p
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యయి.
ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పై విమర్శలు చేశారు.
వైద్యం విషయంలో అప్పటి కాంగ్రెస్ పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు.h3 Class=subheader-style7.
జీవిత రాజశేఖర్ కామెంట్స్/h3p """/" /
సిద్దిపేట జిల్లాలో జరుగుతున్న అరాచకాలు చూస్తుంటే సినిమా విలన్లు కూడా సరిపోరని బీజేపీ నేత జీవితా రాజశేఖర్ అన్నారు.
H3 Class=subheader-style8.కరెంట్ కోతలపై షర్మిల ఎద్దేవా/h3p
వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తున్నామంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు.
వ్యవసాయానికి 24 గంటలు కరెంటు ఇస్తున్నాము అంటూ మన కేసీఆర్ గోబిల్స్ ప్రచారం చేస్తున్నారని షర్మిల మండిపడ్డారు.
H3 Class=subheader-style9.ఎమ్మెల్యే రెడ్యానాయక్ సవాల్/h3p """/" /
హైదరాబాదులో నాకు భూమి ఉన్నట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే రెడ్డినాయక్ అన్నారు .
తనపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన విమర్శలకు రెడ్యానాయక్ స్పందించారు.
H3 Class=subheader-style10. బీబీసీపై నిషేధానికి సుప్రీంకోర్టు తిరస్కరణ/h3p
ప్రధాని నరేంద్ర మోది పై బీబీసీ డాక్యుమెంట్ రూపొందించి నేపథ్యంలో బీబీసీ ని నిషేధించాలని హిందూ సేనగుప్త సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
H3 Class=subheader-style11.లోకేష్ పాదయాత్ర పై రోజా కామెంట్స్/h3p """/" /
నారా లోకేష్ యువ గళం పాదయాత్ర పై మంత్రి ఆర్కే రోజా కామెంట్స్ చేశారు.
లోకేష్ పాదయాత్ర జోకేష్ యాత్రల మారిందని, జబర్దస్త్ తో పోటీపడుతోందని రోజా విమర్శించారు.
H3 Class=subheader-style12.పార్టీ మార్పుపై వైసీపీ ఎమ్మెల్యే క్లారిటీ/h3p
తాను పార్టీ మారుతున్నానంటూ జరుగుతున్న ప్రచారంపై మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్పందించారు.
తాను పార్టీ మారుతున్నాననే ప్రచారంలో వాస్తవం లేదని నేను వైఎస్సార్ అభిమానినని, ఎప్పటికీ పార్టీ మారనంటూ వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు.
H3 Class=subheader-style13.బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు/h3p """/" /
అధికారంలోకి వచ్చాక సెక్రటేరియట్ పైన ఉన్న డోమ్ లని కూల్చివేస్తామని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
H3 Class=subheader-style14.పోడు భూములపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు/h3p
పోడు భూముల విషయంలో అసెంబ్లీలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
గిరిజనుల గురించి మాట్లాడటం చాలా తేలికని, ఆక్రమణ కాదు దురాక్రమణ అంటూ మండిపడ్డారు.
అడవి బిడ్డలు అయితే అడవి అంతా కొట్టేస్తారా అంటూ కేసిఆర్ ప్రశ్నించారు.h3 Class=subheader-style15 పోలవరం నిర్మాణం పై మంత్రి అంబటి స్పందన/h3p """/" /
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తొందరపాటు ఏమాత్రం పనికిరాదని, గత ప్రభుత్వం తొందరపాటుతో ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతోందని ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
H3 Class=subheader-style16.హైదరాబాద్కు కేంద్ర హోం మంత్రి/h3p
హైదరాబాద్ కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈరోజు రానున్నారు.
రాత్రి 10.15 నిమిషాలకు అమిత్ షా నగరానికి చేరుకోనున్నారు.
H3 Class=subheader-style17.నేడు రెండు వందే భారత్ రైళ్ళను ప్రారంభించనున్న ప్రధాని/h3p """/" /
దేశంలో ఇప్పటికే 8 వందే భారత్ రైళ్లు ప్రారంభం కాగా, తాజాగా మరో రెండు రైళ్ళను ప్రధాని ఈ రోజు ప్రారంభించనున్నారు.
H3 Class=subheader-style18.ఆదానీ వ్యవహారంపై సుప్రీం లో విచారణ/h3p
నేడు సుప్రీం కోర్టు లో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆదాని వ్యవహారంపై విచారణ జరగనుంది.
H3 Class=subheader-style19.నేటి నుంచి బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్/h3p """/" /
నేటి నుంచి తెలంగాణలో బిజెపి స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ప్రారంభమయ్యాయి 119 నియోజకవర్గాల్లో 15 రోజులపాటు సమావేశాలు జరుగుతాయి.
H3 Class=subheader-style20.నేడు పలు రైళ్లు రద్దు/h3p
ట్రాక్ మరమ్మత్తులు కారణంగా కాకినాడ పోర్ట్ విశాఖపట్నం, విశాఖపట్నం కాకినాడ పోర్ట్, కాకినాడ పోర్ట్ విజయవాడ, విజయవాడ కాకినాడ పోర్టు రైళ్లను నేడు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
గుడ్ న్యూస్ చెప్పబోతున్న నటుడు నాగశౌర్య… తండ్రి కాబోతున్నారా?