జగన్ బాటలో కేసీఆర్: పార్టీ నేతలకు వార్నింగ్ లు

తమ పార్టీ నేతలు బిజెపి అగ్ర నాయకులతో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం, పార్టీకి కనీస సమాచారం లేకుండా బిజెపి అగ్ర నాయకులు అపాయింట్మెంట్ తీసుకుని చర్చలు జరపడం తదితర పరిణామాలు ఈమధ్య వైసీపీలో ఎక్కువైపోయాయి.

ఏపీలో వైసీపీ వర్సెస్ బిజెపి అన్నట్టుగా పోరు తీవ్రతరం అవ్వడంతో తమ పార్టీ కీలక నాయకులు ఎంపీలను బిజెపి లాగేసుకుంటుంది అనే అనుమానంతో జగన్ ఉన్నారు.

అందుకే తమ పార్టీ నాయకులకు, ఎంపీలకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు.అయినా కొంతమంది బిజెపి నాయకులతో కలసి ఉంటూ కలవరం పుట్టిస్తున్నారు.

రేపోమాపో బీజేపీ తీర్థం తీసుకునేలా కొంతమంది వ్యవహరిస్తున్నారు.నరసాపురం వైసిపి ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈ వరుసలో ముందున్నారు.

"""/" /ఇక తెలంగాణ రాజకీయాల గురించి చర్చించుకుంటే ఏపీలో జగన్ ప్రభుత్వం ఏ విధంగా అయితే తమ పార్టీ నేతలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో ఇవే అనుమానాలు టిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ కూడా వ్యక్తం చేస్తున్నారు.

తమ పార్టీ నాయకులు ఎవరు బీజేపీకి దగ్గరగా ఉండకుండా చూసుకుంటున్నారు.ఢిల్లీలో బిజెపి నాయకులకు దూరంగా ఉండాలంటూ ఇప్పటికే పార్టీ ఎంపీలకు కెసిఆర్ గట్టి హెచ్చరికలు చేశారు.

పార్లమెంట్ సమావేశాల సందర్భంగా మీడియాకు కూడా దూరంగా ఉండాలని, ఎక్కడ, ఎప్పుడు ఏ విషయం గురించి మీడియా ముందు మాట్లాడవద్దు, కనీసం మీడియా ప్రతినిధులు ఫోన్ చేసిన స్పందించి వద్దంటూ కేసిఆర్ హెచ్చరిక చేశారు.

"""/" /మంత్రులు ఏ విషయం ఏదైనా మీడియా తో మాట్లాడాలి అంటే ముందుగా పల్లా రాజేశ్వర్ రెడ్డి కి దానిపై సమాచారం ఇవ్వాలని, అలాకాకుండా ఎవరికి వారు తమ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం కుదరదు గట్టిగానే చెప్పారట.

ప్రస్తుతం బిజెపి టిఆర్ఎస్ ను టార్గెట్ చేసుకోవడంతో కేసీఆర్ ముందస్తుగా ఈ విధంగా వ్యవహరిస్తున్నట్టుగా పార్టీలో చర్చ నడుస్తోంది.

తెలంగాణాలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బాగా బలహీనపడడంతో బీజేపీ వేగంగా ఎదుగుతోందనే అనుమానం కేసీఆర్ లో బాగా పెరిగిపోయింది.

రాబోయే రోజుల్లో బీజేపీనే తమకు ప్రధాన ప్రత్యర్థి కాబోతున్న నేపథ్యంలో కేసీఆర్ తమ పార్టీ నేతలెవరూ చేజారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

నాగబాబు ట్వీట్ పై స్పందించిన శిల్పా రవి.. ఏమన్నారంటే?