ప్రభుత్వం జీతాలు చెల్లించకుంటే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతాం - బొప్పరాజు వెంకటేశ్వర్లు

విజయవాడ: 90 ఉద్యోగుల సంఘం నేతలు సమావేశం.జనవరి 15 ప్రభుత్వం కు డెడ్ లైన్ సమ్మె చేస్తాము అంటూ వార్నింగ్.

జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి ప్రభుత్వం వైఖరికి నిరసన జ్వాల.

AP జేఏసీ అమరావతి బొప్పరాజు వెంకటేశ్వర్లు కామెంట్స్.ఈరోజు మా రాష్ట్ర కార్యవర్గ‌ సమావేశం నిర్వహించాం.

ఎపి జేఎసి అమరావతి మూడో మహా సభ కర్నూలు లో ఫిబ్రవరి ఐదో తేదీన జరుపుతాం.

వేలాదిగా ఉద్యోగులు అంతా తరలి రావాలని కోరుతున్నాం.ఉద్యోగులు సమస్యలు పై సమావేశం వాడివేడిగా సాగింది.

మాకు రావాల్సిన వేల‌కోట్లు రూపాయలు ఇవ్వక‌పోగా.ప్రతి నెలా భత్యాలు కూడా ఒకటో తేదీకి ఇవ్వడం లేదు.

రెండేళ్లు పాటు భరించాం.‌ ప్రభుత్వానికి ఇది ఒక అలవాటుగా మారింది.

జీతాలు, పెన్షన్ లు ఇరవై తేదీ అయినా ఇవ్వడం లేదు.జీత, భత్యాల‌ కోసం ఉద్యోగులు రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి తెచ్చారు.

మా బకాయిలు అడగకూడదనే.జీతాలు ఆలస్యం చేస్తున్నారా.

మేము దాచి పెట్టుకున్న డబ్బులు కోట్ల రూపాయలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి.ఆ డబ్బులు మాకు ఇవ్వకుండా ఎందుకు కాలయాపన చేస్తున్నారు.

పదవీ విరమణ చేసిన రోజే బెన్ ఫిట్స్ ఇచ్చి పంపాలని నిబంధన.ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడంతో మదన పడుతున్నారు.

రిటైర్ అవ్వాలంటే ఉద్యోగులు భయ పడుతయన్నారు.ఉద్యోగి చనిపోతే మట్టి ఖర్చు కూడా ఇవ్వడం లేదు.

అధికారి తన జేబులో డబ్బు ఇస్తున్నారు.ఉద్యోగులు, పెన్షనర్ల వద్ద డబ్బు కట్ చేసి వెనక్కి తీసుకున్నారు.

ఇన్ని వేల‌కోట్ల రూపాయల బకాయిలు ఛలో విజయవాడ తో వచ్చాయి.సిఎం గారితో చర్చల్లో బకాయిలు చెల్లిస్తని హామీ ఇచ్చారు.

ఇప్పుడు ఒక్క రూపాయి ఇవ్వకపోగా, జీతాలు కూడా ఇవ్వడం లేదు.ఛలో విజయవాడ తర్వాత చెల్లింపులో పురోగతి లేదు.

సిపియస్ రద్దు, ఉద్యోగాలు పర్మినెంట్, జీత భత్యాల చెల్లింపు అన్నారు.స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ అమలు చేయలేదు.

అసలు మా డబ్బు మాకు ఇస్తారా.‌ కనీసం మేము కష్టపడి పని చేసినా జీతం ఇవ్వరా.

మేము ఎప్పుడూ సహకరిస్తూనే ఉన్నా ప్రభుత్వం స్పందించడం లేదు.బకాయిలు చెల్లింపు, ఒకటో తేదీన జీత భత్యాల పై సిఎం సమావేశం పెట్టాలి.

"""/"/ వీటి పై ఉద్యోగ సంఘాలతో చర్చ చేసి హామీ ఇవ్వాలి.అధికారులు, మంత్రి వర్గ ఉప సంఘం హామీ ఇవ్వలేక పోతుంది.

సిఎం స్వయంగా వీటి పై స్పందించాలని కోరుతున్నాం.ఈ పరిస్థితి ఇలాగే ఉంటే సంక్రాంతి తరువాత ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతాం.

సిపియస్ పై పదే పదే చర్చల పేరుతో ఎందుకు పిలుస్తున్నారు.ఓపియస్, సిపియస్ రెండే కదా దేశంలో ఉంది.

వీటి పై సమావేశం పేరుతో మమ్మలని ఎందుకు ఇబ్బంది పెడతారు.సిఎం సిపియస్ రద్దు చేస్తామన్న హామీని అమలు చేయాలి.

ఆరు రాష్ట్రాల్లో సిపియస్ రద్దు చేశారు.తాజాగా హిమాచల్ ప్రదేశ్ లో రద్దు, సిక్కిం కూడా కమిటీ వేసింది.

ఇక చర్చలతో పని లేదు.మేము వెళ్లేది లేదు.

భవిష్యత్తు లో కూడా రాష్ట్ర ప్రభుత్వం సిపియస్ రద్దు చేయాలి.పాత పెన్షన్ విధానం తప్ప.

మరొకదానికి అంగీకరించం.11వ పిఆర్సీ విషయంలో ఉద్యోగుల నుంచి మా పై ఒత్తిడి ఉంది.

"""/"/ 11వ పిఆర్సీ లో జరిగిన అవకతవకలు వల్ల ఉద్యోగులు నష్టపోయారు.12వ పిఆర్సీ ‌కమిషన్ ద్వారా నివేదిక తెప్పించు కోవాలి.

మాకు జరిగిన అన్యాయాన్ని సరి చేయాలి.ప్రభుత్వం ల ఉద్యోగుల పై పని ఒత్తిడి పెరిగిపోతుంది.

అనుభవం కలిగిన తహశీల్దారు కూడా ఉరి వేసుకున్నాడు.రీ సర్వే, వ్యవసాయం, ఇళ్ల స్థలాలు, ధాన్యం సేకరణ, వంటి పనులు ఒకేరోజు అప్పగిస్తున్నారు.

జిల్లా‌ కలెక్టర్లకు ర్యాంకింగ్ లు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు.దీని వల్ల పని భారం తో ఒత్తిడి తట్టుకోలేక పోతున్నారు.

గతంలో సిఎం చెప్పిన విధంగా పది నుంచి ఆరు‌ వరకు పని‌వేళలు అమలు చేయాలి.

ఆత్మహత్య లు పరిష్కారం కాదని ఉద్యోగులకు మనవి చేస్తున్నాం.నీతిగా పని చేసినంత కాలం మీకు ఏ ఇబ్బంది ఉండదు.

ఎపి జేఎసి అమరావతి మీకు అండగా ఉంటుంది.కరోనా సమయంలో అనేక మంది ఉద్యోగులు చనిపోయారు.

కారుణ్య నియామకాల విషయంలో ప్రభుత్వం ఒన్ టైం కింద నియమించాలి.ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా.

కొంతమంది అధికారులు సొంత నిర్ణయం తీసుకుంటున్నారు.ఫ్రంట్ లైన్ అనే కొలమానాలు పెట్టి జీవితాలను నాశనం చేయకండి.

ఆయా శాఖల్లోనే చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు కు ఇవ్వాలి.