ప్రజల భాగస్వామ్యం,ఐక్యత ఉంటే ఏదైనా సాధ్యమే:మంత్రి
TeluguStop.com
సూర్యాపేట జిల్లా:ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి,పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు.
సూర్యాపేటలోని 18 వ వార్డు విజయ కాలనీలో లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న కూరగాయల మార్కెట్లో రూ.
46.50 లక్షల నిధులతో నిర్మించనున్న సీసీ రహదార్లు,డ్రైన్ లకు మంత్రి గురువారం శంకుస్థాపన చేశారు.
అనంతరం వార్డు ప్రజలతో కలిసి చెట్లు నాటారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
పల్లెలన్ని పట్టణాలుగా, పట్టణాలు నగరాలుగా ఆధునీకరణ జరగాలనే లక్ష్యంతో పల్లె ప్రగతి,పట్టణ ప్రగతి ద్వారా అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుందన్నారు.
పల్లె ప్రగతి,పట్టణ ప్రగతితో రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు.నగరంలో మార్కెటు లేక రోడ్లపై వ్యాపారులు కూరగాయలు అమ్మేవారని, వారి కోసమే దేశంలో ఎక్కడా లేని విధంగా సూర్యాపేటలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను ఏర్పాటు చేశామని,వాటిని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.
పల్లె ప్రగతి,పట్టణ ప్రగతితో ప్రజల జీవన శైలి ఆధునీకరణ జరిగిందన్నారు.తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆరోగ్యపట్టణంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని మంత్రి ప్రజలను కోరారు.
రోడ్లపై ఆక్రమణలు జరగకుండా చూడాలని అన్నారు.కేసీఆర్ పార్టీ ప్రకటనతో దేశవ్యాప్త చర్చ మొదలైందని ప్రజలు కేసీఆర్ పాలన కావాలని కోరుకుంటున్నారని మంత్రి అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని అన్నారు.
కాళేశ్వరం జలాలతో ప్రతి ఎకరాకు మీరు ఇవ్వడంతో పంట 10 రేట్లు పెరిగిందన్నారు.
రాష్ట్రంలో తాగునీటి సాగునీటి సమస్య తీరిందని,ఇతర రాష్ట్రాల ప్రజలు అందరూ తెలంగాణ వైపు చూస్తున్నారని అన్నారు.
ప్రజలు ఏదైతే కోరుకుంటారో కేసీఆర్ అదే చేస్తాడని మంత్రి అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ అన్నపూర్ణమ్మ,గ్రంథాలయ ఛైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టాకిషోర్,పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ, కౌన్సిలర్లు కమలా చంద్రు నాయక్,భాషామియా, వార్డ్ అధ్యక్షుడు సత్తిరెడ్డి,జిల్లా నాయకులు రామగిరి నగేష్ తదితరులు పాల్గొన్నారు.
మతిమరుపే అతన్ని కోటీశ్వరుడిని చేసింది.. అదెలాగో తెలిస్తే..