ఈ పెండ్లి కూతురు డ్యాన్స్ చూస్తే ఎవ్వ‌రైనా ఫిదా కావాల్సిందేనేమో.

పెళ్లి.రెండు జీవితాల‌ను ఒక్క‌టి చేసే గొప్ప తంతు.

జీవితంలో ఎవ‌రికైనా పెళ్లి ఒక ముఖ్య‌మైన ఘ‌ట్ట‌మే.చాలా మంది చిన్న‌ప్ప‌టి నుంచి పెళ్లి ఇలా చేసుకోవాలి, అలా చేసుకోవాలి అంటూ క‌ల‌లు కంటుంటారు.

కొంత మంది వాటిని నిజం చేసుకుంటే, ఆర్థిక ప‌రిస్థితులు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల కొంద‌రు సింపుల్‌గానే చేసుకుంటారు.

అయితే ఇటీవ‌ల చాలా పెళ్లిల్లు ఆడంభ‌రంగా చేసుకుంటున్నారు.ఖ‌ర్చుకు ఏమాత్రం వెనుకాడ‌టం లేదు.

పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్‌లు, ఫొటో షూట్‌లు, సంగీత్‌, పెళ్లి, రిసెప్ష‌న్ అంటూ చాలా హంగామా చేస్తున్నారు.

గ‌తంలో మాదిరిగా ఐదు రోజుల పెళ్లిలు, ప‌ది రోజుల పెళ్లిల్లు చేసుకుంటున్నారు.పెళ్లిలో ఫొటో షూట్ అనేది ఓ ముఖ్య భాగం అయిపోయింది.

ఆ న‌వ దంపతులు క‌ల‌కాలం ఆ అపురూప దృశ్యాల‌ను త‌మ మ‌దిలో దాచుకుంటారు.

గుర్తుకు వ‌చ్చిన‌ప్పుడు త‌నివితీరా చూస్తారు.అలాగే పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు, ఇద్ద‌రూ క‌లిసి డ్యాన్స్ చేయ‌డం ఇటీవ‌ల సాధార‌ణం అయిపోయింది.

తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో జ‌రిగిన ఓ పెళ్లిలో న‌వ వ‌దువు భ‌రాత్‌లో చేసిన బుల్లెట్ బండి సాంగ్ ఎంత పాపుల‌ర్ అయ్యిందో అంద‌రికీ తెలిసిందే.

ఓ 15 రోజుల ఆ సాంగ్ ట్రెండింగ్‌లో ఉంది. """/"/ ఇప్పుడు ఏ పెళ్లిలో చూసిన‌, ఏ భ‌రాత్‌లో చూసినా, ఏ డిజే వ‌ద్ద చూసిన ఈ బుల్లెట్ బండి సాంగే వినిపిస్తోంది.

అంతాలా ట్రెండ్ సెట్ చేసింది ఆ న‌వ వ‌దువు సాంగ్.అలాంటి డ్యాన్స్ గురించే మ‌నం ఇప్పుడు మాట్లాడుకోబోతుంది.

ఆ ప్రాంతం ఎక్క‌డ స‌రిగా తెలియ‌దు గానీ అక్క‌డ ప్రీ వెడ్డింగ్ షూట్ న‌డుస్తోంది.

అంద‌రూ మేక‌ప్ రూంలో ఉండ‌గానే ఓ సాంగ్‌కు న‌వ వ‌దువు డ్యాన్స్ చేసింది.

ఆ డ్యాన్స్ ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.చాలా చ‌క్క‌గా డ్యాన్స్ చేయ‌డంతో నెట్టిజ‌న్లు ఫిదా అవుతున్నారు.

జుట్టు రాలడం, చుండ్రు.. ఈ 2 సమస్యలకు చెక్ పెట్టే పవర్ ఫుల్ ఆయిల్ ఇది..!