ఆడపిల్లలను ఎవరైనా వేధించినట్లయితే వారి పైన చట్టరీత్యా శిక్షించడం జరుగుతుంది..కో ఆర్డినేటర్ రోజా

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని జడ్.పి.

హెచ్.ఎస్ పాఠశాలలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు గురువారం రోజున అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇట్టి కార్యక్రమంలో భాగంగా మహిళా సాధికారిక జిల్లా కో ఆర్డినేటర్ రోజా మాట్లాడుతూ మహిళల యొక్క అభివృద్ధి రక్షణ గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది.

ముఖ్యంగా ఫోక్సో చట్టం గురించి ఆడపిల్లలను ఎవరైనా వేధించినట్లయితే వారి పైన చట్టరీత్యా శిక్షించడం జరుగుతుందని, అమ్మాయిల పట్ల ఎవరైన ఆ మర్యాదగా ప్రవర్తన హెల్ప్ లైన్ నెంబర్ 1098, 181 సఖి సెంటర్ మహిళలకు అందిస్తున్నటువంటి వైద్య, న్యాయ, కౌన్సిలింగ్ , పోలీస్ ,షెల్టర్ వంటి ఉచిత సేవల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు, చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ వాటి యొక్క సేవలను గురించి పూర్తి సమాచారం పిల్లలకు అందించారు.

అనంతరం ఐసిడిఎస్ సూపర్వైజర్ చంద్రకళ అంగన్వాడీలోని బాలలకి పౌష్టికాహారము గురించి,అంగన్వాడి సెంటర్ యొక్క ప్రాధాన్యతను గురించి బాలింతలకి ఎలాంటి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు పోషకాహారాలను తీసుకొని మంచి ఆరోగ్యవంతమైనటువంటి భవిష్యత్తుని పిల్లలకి ఇవ్వాలని సూచించడం జరిగిందని చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ పరమేశ్వర్ 1098 యొక్క సేవలను జిల్లాలోని ఒక ముఖ్యమైనటువంటి భాగాన్ని పోషిస్తున్నట్టుగా వివరించడం జరిగింది.

అందులో చైల్డ్ లేబర్స్ , డ్రాప్ అవుట్స్ చైల్డ్ మ్యారేజ్ వీటిని గురించి పిల్లలకి వివరించడం జరిగింది.

అలా చేయడం ద్వారా పిల్లల హక్కుల చట్టం జెజెబి గురించి వివరించడం జరిగింది పిల్లలు బడిలో ఉండాలి కర్మగారాలలో పరిశ్రమలలో ఉండడం చట్టరీత్యా నేరము పిల్లలతో పని చేయించుకోవడం ద్వారా ప్రభుత్వం వారిని శిక్షించడం జరుగుతుందని దీనిని అందరూ గమనించవలసిందిగా కోరడం జరిగింది,పిల్లల విషయంలో నాటు వైద్యాన్ని ప్రదర్శించడము చట్టరీత్యా నేరము దానికి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇలాంటి ఇబ్బందులతో కానీ ఎవరైనా 1098కి ఫోన్ చేసి తెలుపవలసిందిగా సూచించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి మహిళా సాధికారిక కౌన్సిలర్ దేవిక, పాఠశాల హెచ్ ఎం ప్రేమ లత,పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ప్లాస్టిక్ బాటిల్ లో నీళ్లు తాగడం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయో తెలుసా..?