Anushka Shetty : బరువు తగ్గి స్లిమ్ లుక్ లోకి మారిపోయిన అనుష్క.. సన్నబడిన అనుష్క అందంగా ఉన్నారంటూ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి( Anushka Shetty ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

అనుష్క మొదట పూరి జగన్నథ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ హోదాను దక్కించుకుంది.

ఇకపోతే బాహుబలి సినిమా తర్వాత అనుష్క చాలా వరకు సినిమాలు చేయడం తగ్గించేసింది.

గత ఏడాది నవీన్ పొలిశెట్టితో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ( Miss Shetty Mr.

Polishetty )అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేకపోయింది.

"""/" / ఇకపోతే అనుష్క బయట కనిపించి చాన్నాళ్లయింది.తెలుగులో ఆమె ఒక సినిమా చేస్తున్నప్పటికీ ఒక్క ఫొటో కూడా బయటకు రాకుండా షూట్ చేస్తున్నారు.

అంతెందుకు, తన గత చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ప్రమోషన్స్ సమయంలో కూడా అనుష్క కు సంబంధించిన ఒక ఫోటో కూడా బయటకు రాలేదు.

అనుష్క ఎందుకిలా తెరవెనక ఉండిపోతోందో అందరికీ తెలిసిందే.ఆమె కొన్నాళ్లుగా అధిక బరువు సమస్యతో బాధపడుతోంది.

బరువు తగ్గడానికి ఆమె చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.ఆమధ్య 2-3 సార్లు బయటకొచ్చినప్పటికీ అనుష్క ఫిజిక్ పై చాలా విమర్శలు చెలరేగాయి.

దీంతో ఆమె పూర్తిగా కనిపించడం మానేసింది. """/" / తాజా  స్టిల్స్ బయటకొచ్చాయి.

ఆశ్చర్యకరంగా ఆమె స్లిమ్ లుక్ లో కనిపించింది.సినిమాల్లో చూపించినట్టు ఇది గ్రాఫిక్స్ కాదు.

నిజంగానే అనుష్క సన్నబడింది.ఒక మలయాళం సినిమాకు అనుష్క ఓకే చెప్పిన సంగతి తెలిసిందే.

ఆ సినిమా సెట్స్ లో ఈరోజు జాయిన్ అయింది ఈ బ్యూటీ.ఈ సందర్భంగా యూనిట్ ఆమెకు సాదరంగా స్వాగతం పలికిన ఫొటోలు బయటకొచ్చాయి.

వాటిలో అనుష్క కాస్త సన్నబడినట్టు కనిపించింది.ఇది నిజంగా ఆమె అభిమానులు సంతోషపడే వార్తే అని చెప్పాలి.

ప్రభాస్ కాలికి గాయం ఇంకా మానలేదా.. నవ్వుతూనే బాధ భరిస్తున్నారా?