Anushka Shetty:బాలయ్యకు దిమ్మతిరిగే షాకిచ్చిన అనుష్క.. ఆ సినిమా అస్సలు నచ్చదంటూ?
TeluguStop.com
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్వీటీ అనుష్క శెట్టి( Sweetie Anushka Shetty ) గురించి మనందరికీ తెలిసిందే.
తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది అనుష్క.
తెలుగులో ప్రభాస్,అల్లు అర్జున్, రానా, రామ్ చరణ్, మహేష్ బాబు, నాగార్జున, రవితేజ లాంటి స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.
అంతేకాకుండా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది అనుష్క.
ఇది ఇలా ఉంటే అనుష్క నుంచి ఎటువంటి సినిమాలు రాక ఇప్పటికీ దాదాపుగా రెండేళ్లు గడిచిపోయింది.
"""/" /
చివరిగా అనుష్క నిశ్శబ్దం సినిమాలో( Nishabdham Movie ) నటించింది.
ఆ తర్వాత అనుష్క సినిమాలకు సంబంధించి ఒక కమిట్మెంట్ కూడా లేదు.అయితే అంతకుముందు భాగమతి,సైరా నరసింహారెడ్డి సినిమాలలో( Bhagmati, Saira Narasimha Reddy Movie ) నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
బాహుబలి సినిమా తర్వాత అనుష్క మరే సినిమా చేయలేదు.అయితే అనుష్క సినిమాలకు దూరంగా ఉండటంతో ఆమె త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది అంటూ వార్తలు వినిపించినప్పటికీ అవన్నీ ఒట్టి రూమర్స్ గానే మిగిలిపోయాయి.
ప్రస్తుతం అనుష్క నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
"""/" /
ప్రస్తుతం అనుష్క చేతిలో ఈ ఒక్క ప్రాజెక్టు మాత్రమే ఉంది.
ఇది ఇలా ఉంటే గతంలో అనుష్క ఇంటర్వ్యూలో భాగంగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇంటర్వ్యూలో భాగంగా అనుష్క మాట్లాడుతూ.మీరు నటించిన వాటిలో ఇష్టమైన సినిమా ఏది ఇష్టం లేని సినిమా ఏది అని అడగగా.
వేదం, అరుంధతి సినిమాలు( Vedam And Arundhati Movies ) అంటే చాలా ఇష్టం.
ఒక్క మగాడు సినిమా( Okka Magadu Is A Movie ) ఇష్టం లేదు అని తెలిపింది.
అనుష్క కెరియర్ లో వచ్చిన అతి పెద్ద గాసిప్ ఏంటి అని అడగగా.
ఐదుసార్లు పెళ్లవ్వడం నవ్వుతూ తెలిపింది అనుష్క.5 మంది హీరోలు ఎవరు అనగా గోపీచంద్, ప్రభాస్, సుమన్, సెంతిల్ అని నవ్వుతూ సమాధానం ఇచ్చింది.
అల్లు అర్జున్ కి ఒక రూల్..వారికి ఒక రూలా… బన్నీ అరెస్టుపై సుమన్ షాకింగ్ కామెంట్స్!