దేవసేన ఫోటోని షేర్ చేసిన అనుష్క… ప్రభాస్ తో మరోసారి జోడి కట్టబోతున్నారా?
TeluguStop.com
సూపర్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటి అనుష్క శెట్టి( Anushka Shetty ) .
ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమె ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
ఇలా అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా సక్సెస్ అందుకున్న అనుష్క బాహుబలి సినిమా( Bahubali ) తో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలు పొందారు.
ఇక బాహుబలి సినిమా తర్వాత ఈమె పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్నారు. """/" /
గత ఏడాది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇక ప్రస్తుతం పలు తెలుగు సినిమాలతో పాటు ఇతర భాష చిత్రాలలో కూడా నటిస్తూ కెరియర్ పట్ల బిజీ అవుతున్నారు.
ఇక సినిమా ఇండస్ట్రీలో కొన్ని జంటలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నవారిలో ప్రభాస్( Prabhas ) అనుష్క జంట ఒకటి.
వీరిద్దరూ బిల్లా, మిర్చి బాహుబలి సినిమాలో నటించారు.వీరిద్దరి నటన ఎంతో అద్భుతంగా ఉంటుంది కనుక ఈ జంటకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.
"""/" /
ఇక బాహుబలి తర్వాత మరోసారి వీరిద్దరూ తెరపై సందడి చేస్తే చూడాలని ఉందని అభిమానులు ఎన్నో సందర్భాలలో వారి కోరికను బయటపెట్టారు అయితే త్వరలోనే అది నెరవేరబోతుందని తాజాగా అనుష్క చేసిన పోస్ట్ చూస్తే తెలుస్తుంది.
సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉండే అనుష్క తాజాగా సోషల్ మీడియా వేదికగా బాహుబలి సినిమాలోని దేవసేన( Devasena ) పాత్రకు సంబంధించిన ఒక ఫోటోని షేర్ చేశారు.
అయితే ఈ ఫోటోకి ఎలాంటి క్యాప్షన్ ఇవ్వలేదు.ఇలా దేవసేన ఫోటో షేర్ చేయడంతో మరోసారి ప్రభాస్ తో ఈమె జత కట్టబోతున్నారా అందుకే ఇలా హిట్ ఇచ్చారా అంటూ అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
ఈ నైట్ జెల్ తో మీ స్కిన్ అవుతుంది సూపర్ వైట్..!