ట్విట్టర్ లో అడుగుపెట్టిన స్వీటీ…మూడు రోజుల్లోనే తొమ్మిది లక్షల ఫాలోవర్స్

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రెటీలు అందరూ ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు.

అలాగే పొలిటికల్ పార్టీలు సోషల్ మీడియాని ఒక ప్రచార సాధనంగా వాడుకుంటున్నాయి.ఇండస్ట్రీలో కొంత మంది సెలబ్రెటీలు అయితే చేసిన సినిమాలు తక్కువే అయినా సోషల్ మీడియా ద్వారా వారికి ఉన్న పాపులారిటీ ఎక్కువ.

ఎప్పటికప్పుడు ఈ భామలు తమ హాట్ ఫోటో షూట్ లని వారి సోషల్ మీడియా అకౌంట్స్ తో షేర్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు.

ఇండియాలో ప్రియాంకాచోప్రా సోషల్ మీడియా ద్వారా ఎక్కువ ఆదాయం ఆర్జిస్తోంది.హాట్ భామలు కూడా సోషల్ మీడియా ద్వారా రెండు చేతులా సంపాదిస్తున్నారు.

దీంతో సెలబ్రెటీలకి ఇదొక ఆదాయవనరుగా మారిపోయింది.అయితే కొంత మంది సెలబ్రెటీలు సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటారు.

అలాంటి వారు కూడా ఈ మధ్య కాలంలో తమ ఆలోచనలు, అభిప్రాయాలు అభిమానులతో పంచుకోవడం కోసం ట్విట్టర్ లోకి వస్తున్నారు.

తాజాగా ఈ జాబితాలోకి సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ అనుష్క కూడా వచ్చి చేరింది.

ఈ భామ అక్టోబర్ 28న సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది.ఆమె ఎంట్రీ ఇచ్చిన మూడు రోజుల్లోనే ఊహించని స్థాయిలో ఫాలోవర్స్ పెరిగిపోయారు.

తన పేరుతో అకౌంట్‌ను ఓపెన్ చేసి అందరికి హాయ్ చెప్పింది.హాయ్ అందరూ ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నా.

నా నుంచి ఆసక్తికర అప్‌డేట్‌ల కోసం నా అధికారిక ట్విటర్ ఖాతాను పాలో అవండని ట్వీట్ చేసింది.

ఈమె రాక కోసం ఎదురుచూస్తున్న చాలా మంది నెటిజన్లు, అనుష్క అభిమానులు ట్విట్టర్ లో ఆమెకి స్వాగతం చెబుతున్నారు.

అదే సమయంలోమూడు రోజుల్లో ఏకంగా తొమ్మిది లక్షల మంది ఫాలోవర్స్ ని ఈ భామ సొంతం చేసుకుంది.

ప్రపంచ రికార్డులను క్రియేట్ చేసిన సీఎం చంద్రబాబు మనవడు దేవాన్ష్.. (వీడియో)