నిశ్శబ్ధం సెన్సార్ టాక్.. మాటలు లేవట!

టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి నటించిన లేటెస్ట్ మూవీ నిశ్శబ్ధం ఎప్పుడో షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.

కానీ కొన్ని కారణాల వల్ల వరుసగా రిలీజ్ డేట్‌ను వాయిదా వేస్తూ వచ్చింది.

ఇక ఈ సినిమాతో మరోసారి లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌లకు తాను రాణి అని నిరూపించుకునేందుకు అనుష్క రెడీ అవుతోంది.

పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన నిశ్శబ్ధం చిత్రాన్ని వేసవి కానుకగా ఏప్రిల్ 2న రిలీజ్ చేద్దామని చిత్ర యూనిట్ భావించింది.

కానీ వారి ఆశలపై లాక్‌డౌన్ నీళ్లు జల్లింది.ఏకంగా రెండు నెలలకు పైగా లాక్‌డౌన్ అమలు కావడంతో ఏ ఒక్క సినిమా కూడా రిలీజ్‌కు నోచుకోలేదు.

కాగా ప్రస్తుతం కొంతమేర సడలింపులు ఉండటంతో నిశ్శబ్ధం చిత్రం సెన్సార్ పనులు ముగించుకుంది.

ఈ సినిమాకు సెన్సార్ బోర్డు సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేశారు.ఈ సినిమా పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్ మూవీగా ప్రేక్షకులను అలరించడం ఖాయమని వారు చిత్ర యూనిట్‌ను అభినందించారు.

తమ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసిన సెన్సార్ బోర్డు సభ్యులకు చిత్ర దర్శకుడు హేమంత్ మధుకర్ ధన్యవాదాలు తెలిపాడు.

అయితే నిశ్శబ్ధం చిత్రాన్ని థియేటర్స్‌లో రిలీజ్ చేయాల్సిందిగా తమకు సెన్సార్ బోర్డు సభ్యులు సూచించారని దర్శకుడు హేమంత్ మధుకర్ తెలిపాడు.

అనుష్క విభిన్న పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మాధవన్, అంజలి, షాలినీ పాండే తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమాను లాక్‌డౌన్ ముగిసిన వెంటనే రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

30 లక్షల ఉద్యోగానికి రాజీనామా చేసి ఐపీఎస్ ఆఫీసర్.. సక్సెస్ కు వావ్ అనాల్సిందే!