Anushka Shetty : స్టార్ హీరోయిన్ అనుష్క తల్లిని మీరు చూశారా.. ఆమె అందమే ఈమెకు వచ్చిందంటూ?

అనుష్క శెట్టి( Anushka Shetty ).ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

టాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది అనుష్క.

అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది.టాలీవుడ్ లో ప్రభాస్, నాగార్జున, అల్లు అర్జున్, రవితేజ, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.

ముఖ్యంగా అరుంధతి సినిమా అనుష్క లైఫ్ ని పూర్తిగా మార్చేసింది.ఇప్పటికీ అభిమానులు ముద్దుగా జేజమ్మ అని కూడా పిలుస్తూ ఉంటారు.

"""/" / కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో( Tamil ) కూడా హిట్ సినిమాల్లో నటించింది.

అగ్రహీరోలతో సమానంగా ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుంది.ఇకపోతే ఇండస్ట్రీలో ఎటువంటి వివాదాల్లో తల దూర్చని హీరోయిన్ లాలో అనుష్క కూడా ఒకరు.

అయితే అనుష్క ఫ్యామిలి( Anushka Family ) గురించి అతి తక్కువ మందికే తెలుసు.

చాలామందికి అనుష్క ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి కూడా సరిగ్గా తెలియదు.ఇది ఇలా ఉంటే తాజాగా అనుష్క తల్లి ప్రేమను పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.తన తల్లి పుట్టినరోజు సందర్బంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.

ఆమె తల్లి ప్రఫుల్ల శెట్టి బర్త్ డే ను అనుష్క శెట్టి ఘనంగా జరిపారు.

"""/" / పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ( Happy Birthday Mom ) అని రాసుకొచ్చింది.

ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా తమ ఫొటోనే షేర్‌ చేసింది.అమ్మను పొగుడుతూ అందమైన నోట్ రాసింది.

అందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అనుష్క అభిమానులు కామెంట్ల వర్షం కురిపించడంతోపాటు అనుష్క తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇకపోతే ఈ మధ్య కాలంలో అనుష్క ఎటువంటి సినిమాలలో నటించడం లేదు.దాదాపు రెండు మూడేళ్లుగా అనుష్క నుంచి ఎటువంటి సినిమాలు రాలేదు.

ఇక అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలో నటిస్తోంది.

విడాకులు తీసుకుంటే  అలా జడ్జ్ చేస్తారా….ఫైర్ అయిన సమంత?