మళ్లీ లావు అయిన స్వీటీ.. సర్జరీ వికటించడంతో ఇలా అంటూ ప్రచారం?
TeluguStop.com
స్వీటీ అనగానే మనకు గుర్తొచ్చే ముద్దుగుమ్మ అనుష్క.ఈ బెంగళూరు బ్యూటీ గురించి తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే.
తన అందంతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఈ ముద్దుగుమ్మ తన నటనతో కూడా మంచి గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోయిన్ గా నిలిచింది.
ఇప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉండగా గత కొంతకాలం నుండి అంతగా సక్సెస్ అందుకోలేకపోతుంది.
ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున నటించిన సూపర్ సినిమాతో 2005లో తొలిసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది.
తొలిసారి నటనతోనే మంచి గ్లామర్ ను కూడా పరిచయం చేసింది.ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న అనుష్క ఆ తర్వాత వెనుతిరిగి చూడకుండా ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.
ఈమె నటించిన అరుంధతి సినిమాతో మాత్రం ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది.తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టి పలు సినిమాలలో నటించింది.
ఇక అనుష్క కెరీర్ కొంత వరకు నాశనం కావడానికి సైజ్ జీరో, పంచాక్షరి, భాగమతి వంటి సినిమాలే కారణమని చెప్పవచ్చు.
ఈ సినిమాల తర్వాత మళ్లీ మంచి సక్సెస్ కావటానికి తెగ ప్రయత్నించింది అనుష్క.
గతంలో కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉండగా నిశ్శబ్దం సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది.కానీ ఈ సినిమా కూడా అనుష్కను నిరాశపరిచింది.
ప్రస్తుతం పలు ప్రాజెక్టులలో అవకాశం అందుకున్నట్లు తెలుస్తుంది.ఇక అనుష్క టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి స్టార్ హీరోయిన్ గా ఎదిగినప్పటినుంచి తన పెళ్లి గురించి ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఎంతోమంది ఎన్నో ఇంటర్వ్యూలలో అనుష్కను పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అని ఎన్నోసార్లు ప్రశ్నించారు.
కానీ అనుష్క మంచిగా సెటిల్ అయిన తర్వాతనే అని చెప్పి తప్పించుకునేది.ఇక గతంలో ప్రభాస్ ని కూడా పెళ్లి చేసుకుంటుందని వారి మధ్య లవ్ నడుస్తుందని ఎన్నో పుకార్లు వినిపించాయి.
అంతేకాకుండా వారిద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి కూడా వారికి ప్రశ్నలు ఎదురవ్వగా కేవలం స్నేహితులమనే చెప్పుకుని తిరిగే వాళ్ళు.
కానీ కొన్నాళ్ల తర్వాత వారి మధ్య మంచి స్నేహం ఉందని బయటపడింది.కానీ ఇప్పటికీ తెలుగు అభిమానులు అనుష్క, ప్రభాస్ ను జంటగా చూడాలని కోరుకుంటూనే ఉన్నారు.
కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం పెళ్లి గురించి ఏ విషయం చెప్పడం లేదు.
ఇక ఇదంతా పక్కన పెడితే అనుష్క మళ్లీ సైజ్ జీరో సినిమాల ఉన్న లాగా తయారయ్యింది.
అంటే అనుష్క మళ్ళీ లావైపోయింది.తను లావైన ఫోటో కూడా ఒకటి వైరల్ గా మారింది.
"""/" /
ఇక దీంతో ఈమె చేయించుకున్న సర్జరీ వికటించడం వల్ల అలా జరిగింది అని కామెంట్లు పెడుతున్నారు.
గతంలో అనుష్క సన్నగా కావడానికి సర్జరీ చేయించుకుంది అని తెలిసింది.దీంతో దానివల్ల ఇలా జరిగింది అని అంటున్నారు.
ఇక తన అభిమానులు మాత్రం తనను ఇండస్ట్రీలో ఇంకా మంచి మంచి సినిమాలతో చూడాలని ఎదురు చూస్తున్నారు.
జర్మనీ పార్లమెంట్ ఎన్నికల బరిలో భారత సంతతి నేత .. ఎవరీ సిద్ధార్ధ్ ముద్గల్?