కోహ్లీ పట్టిన క్యాచ్ కు.. అనుష్క శర్మ రియాక్షన్ అదుర్స్..!

తాజాగా బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదికగా లక్నో- బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ఒక్క వికెట్ తేడాతో బెంగళూరు జట్టు ఓడిన సంగతి తెలిసిందే.

అయితే మ్యాచ్ ను వీక్షించిన విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ స్టేడియంలో సందడి చేసింది.

అనుష్క శర్మ బెంగళూరు జట్టు బౌండరీలు కొట్టిన ప్రతిసారి చప్పట్లు కొడుతూ జట్టుకు సపోర్ట్ చేసింది.

ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అద్భుత ఆటను కనపరిచాడు.44 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్స్ లతో 61 పరుగులు చేసి ఓ అరుదైన రికార్డ్ ను ఖాతాలో వేసుకున్నాడు.

ఐపీఎల్ లో ఆడుతున్న ఎనిమిది టీమ్లపై అర్థ సెంచరీలు చేసిన కోహ్లీ, లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో అర్థ సెంచరీ చేశాడు.

దీంతో ఐపీఎల్ లో ఆడే అన్ని జట్లపై అర్థ సెంచరీ చేసిన రికార్డు సృష్టించాడు.

"""/" / మ్యాచ్లో లక్నో జుట్టు కెప్టెన్ కే ఎల్ రాహుల్ క్రీజ్ లో( KL Rahul ) చాలా సేపు నిలబడిన బెంగళూరు జట్టు బౌలర్ల దాటికి తట్టుకోలేక కేవలం 20 బంతుల్లో 18 పరుగులు చేశాడు.

మహమ్మద్ సిరాజ్ వేసిన బంతికి.విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

"""/" / రాహుల్ క్యాచ్ పట్టిన విరాట్ కోహ్లీ ఆకాశమే హద్దుగా అరుస్తూ వైల్డ్ సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు.

ఈ క్రమంలో స్టాండ్స్ లో ఉన్న అనుష్క శర్మ లేచి నిలబడి చప్పట్లు కొడుతూ తెగ సందడి చేసింది.

ప్రస్తుతం రాహుల్ క్యాచ్ అవుట్ అయ్యాక విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల రియాక్షన్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

"""/" / ఇక బెంగుళూరు జట్టు ఆడిన మూడు మ్యాచ్లలో రెండు ఓటములను ఖాతాలో వేసుకొని లీగ్ పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది.

ఈ జట్టు ప్లే ఆఫ్ కు చేరాలంటే బ్యాటింగ్, ఫీల్డింగ్ లో జట్టు ఆట ప్రదర్శనలో మార్పు అవసరం.

లేదంటే ప్లే ఆఫ్ చేరే ఆశలు గల్లంతు అయ్యే అవకాశాలు ఉన్నాయి.

తేన్పులు పదే ప‌దే వ‌స్తున్నాయా.. వ‌ర్రీ వ‌ద్దు వాటికి ఇలా అడ్డుక‌ట్ట వేయండి!!