అనుష్క సినిమాపై నిశ్శబ్ధం ఎందుకో?

టాలీవుడ్ స్వీటీ అనుష్క నటించిన లేటెస్ట్ మూవీ నిశ్శబ్దం ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది.

కానీ పలు కారణాల వల్ల వరుసగా వాయిదా పడుతూ వస్తోన్న ఈ సినిమాను ఎట్టకేలకు వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.

కానీ వారి ఆశలపై కరోనా వైరస్ నీళ్లు జల్లింది.ఈ సినిమా రిలీజ్‌కు మరోసారి బ్రేకులు పడ్డాయి.

దీంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుందా లేదా అనే సందేహం ఇప్పుడు అందరిలోనూ మొదలైంది.

ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి కూడా లేకపోవడంతో నిశ్శబ్ధం చిత్రం అసలు ఇప్పట్లో రిలీజ్ అవుతుందా అని అనుష్క ఫ్యాన్స్ అంటున్నారు.

అయితే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలంటూ భారీ ఆఫర్లు చిత్ర యూనిట్‌కు అందుతున్నాయి.

దీంతో చిత్ర యూనిట్ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.గతంలోనే ఓటీటీలో సినిమాను రిలీజ్ చేయబోమని చిత్ర యూనిట్ తెలిపింది.

కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడమే ఉత్తమమని వారు భావిస్తున్నారు.

కాగా ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకోగా, ఇప్పుడు నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు వారు ప్రయత్నాలు చేస్తున్నారట.

మరి నిశ్శబ్ధం చిత్రం నేరుగా ఓటీటీలో ప్రత్యక్షమవుతుందా లేదా అనేది చూడాలి.ఏదేమైనా ఈ సినిమా రిలీజ్ మరింత ఆలస్యం చేస్తే బాగోదని చిత్ర యూనిట్ భావిస్తోందట.

వైట్‌హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా భారత సంతతి జర్నలిస్ట్.. ట్రంప్ ప్రకటన