నిశబ్దం కొత్త విడుదల తేదీపై తర్జనభర్జనలు

కరోనా కారణంగా సినిమా పరిశ్రమ స్థంభించి పోయింది.కేవలం తెలుగు సినిమా పరిశ్రమ కాకుండా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నా కూడా సినిమా పరిశ్రమలు కూడా నిలిచి పోయిన విషయం తెల్సిందే.

ప్రస్తుతానికి మార్చి 31 వరకు ఈ స్థంభన కొనసాగబోతుంది.అయితే ఆ తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా ఏప్రిల్‌ మొదటి లేదా రెండవ వారం వరకు థియేటర్ల బంద్‌ కొనసాగే అవకాశం ఉందంటున్నారు.

ఈ నేపథ్యంలో విడుదల కావాల్సిన పలు సినిమాలు వాయిదాలు పడుతున్నాయి.నిన్న మొన్నటి వరకు ఏప్రిల్‌ 2న నిశబ్దం చిత్రం విడుదల చేసి తీరుతాం అన్నట్లుగా ఉన్న అనుష్క అండ్‌ టీం ఇప్పుడు సైలెంట్‌ అయ్యారు.

ఏప్రిల్‌ రెండవ వారం విడుదల దాదాపుగా అసాధ్యం అని తేలిపోయింది.అందుకే కొత్త విడుదల తేదీ విషయమై తర్జనబర్జను పడుతున్నట్లుగా సమాచారం అందుంతోంది.

కొత్త విడుదల తేదీ విషయంలో అతి త్వరలోనే యూనిట్‌ సభ్యులు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

మే వరకు సినిమాను వాయిదా వేయకుండా ఏప్రిల్‌ చివర్లోనే సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారట.

అందుకోసం థియేటర్ల బంద్‌ ముగిన వెంటనే డేటును అనౌన్స్‌ చేసేందుకు సిద్దంగా ఉండాలని భావిస్తున్నారు.

అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఏప్రిల్‌ మూడవ లేదా నాల్గవ వారంలో నిశబ్దం సైలెంట్‌గా అయినా వచ్చే అవకాశం కనిపిస్తోంది.

నాయకుడిపై ప్రజల్లో నమ్మకం ఉండాలి..: సీఎం జగన్