ఘాటి గ్లింప్స్ రివ్యూ.. అనుష్క ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పక్కా అంటూ?
TeluguStop.com
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టికి ( Anushka Shetty )ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అరుంధతి, భాగమతి సినిమాల( Arundhati , Bhagamati ) తర్వాత అనుష్క ఈ సినిమాలో మరో పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఘాటి సినిమా నుంచి తాజాగా గ్లింప్స్ రిలీజ్ కాగా ఈ గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
47 సెకన్ల నిడివితో ఉన్న ఈ గ్లింప్స్ లో ప్రతి ఫ్రేమ్ రిచ్ గా ఉంది.
నేరస్థురాలిగా మారిన ఓ బాధితురాలి కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది.ట్రైబల్ అమ్మాయి( Tribal Girl
) రోల్ లో అనుష్క అదరగొట్టారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
యూవీ క్రియేషన్స్ బ్యానర్ ( UV Creations Banner )నిర్మాతలు పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
తెలుగుతో పాటు ఇతర ప్రధాన భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. """/" /
అనుష్క మరోసారి పవర్ ఫుల్ రోల్ లో కనిపించనుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.
క్రిష్ తన శైలికి భిన్నమైన కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల హరిహర వీరమల్లు ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న క్రిష్ అనుష్క మూవీతో బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో మ్యాజిక్ చేస్తారో చూడాలి.
దాదాపుగా రెండు దశాబ్దాల పాటు ఊహించని రేంజ్ లో క్రేజ్ తో అనుష్క సత్తా చాటుతున్నారు.
"""/" /
అనుష్క రేంజ్ లో మార్కెట్ ఉన్న మరో స్టార్ హీరోయిన్ లేరనే చెప్పాలి.
యూవీ క్రియేషన్స్ బ్యానర్ తో అనుష్కకు మంచి అనుబంధం ఉండగా ఈ బ్యానర్ లో మాత్రమే అనుష్క వరుస సినిమాలలో నటిస్తున్నారు.
2025లో ఘాటి సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.క్రిష్ కెరీర్ లో ఘాటి మరో స్పెషల్ మూవీగా నిలవడం పక్కా అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
వేదం తర్వాత క్రిష్ అనుష్క కాంబోలో తెరకెక్కిన సినిమా ఇదే కావడం గమనార్హం.
చెక్‌బౌన్స్ కేసులో రామ్ గోపాల్ వర్మకు మూడు నెలల జైలు శిక్ష