స్వీటీ అనుష్క నాట్ ఇంట్రెస్టెడ్.. నవీన్ సినిమాకు షాక్..!

నిశ్శబ్ధం సినిమా తర్వాత స్వీటీ అనుష్క నెక్స్ట్ సినిమా కోసం ఆమె ఫ్యాన్స్ తెలుగు ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు లేటెస్ట్ గా జాతిరత్నాలు హీరో నవీన్ పొలిశెట్టితో అనుష్క సినిమా చేస్తుందని వార్తలు వచ్చాయ్.

మహేష్ డైరక్షన్ లో ఈ సినిమా వస్తుందని అన్నారు.అయితే సడెన్ గా ఏమైందో ఏమో కాని అనుష్క ఈ ప్రాజెక్ట్ చేయనని చెప్పేసిందట.

కథ నచ్చినా సరే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా చేయనని చెప్పిందట అనుష్క.

స్వీటీ కాదనేసరికి సినిమాలో హీరోయిన్ కోసం మళ్లీ వేట మొదలు పెట్టారు చిత్రయూనిట్.

"""/"/ యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కే ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి పాత్ర చాలా విచిత్రంగా ఉంటుందని తెలుస్తుంది.

ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జారిరత్నాలు సినిమాల హిట్లతో సూపర్ జోష్ లో ఉన్నాడు నవీన్ పొలిశెట్టి.

ఈ సినిమాతో పాటుగా మరో రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయని తెలుస్తుంది.

నవీన్ పొలిశెట్టి సినిమా నుండి అనుష్క ఎగ్జిట్ అవగా మరో స్టార్ హీరోయిన్ ను తీసుకునే ప్రయత్నాల్లో మేకర్స్ ఉన్నారని తెలుస్తుంది.

సినిమాలో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందట అందుకే స్టార్ హీరోయిన్నే తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు దర్శక నిర్మాతలు.

జుట్టు దట్టంగా పెరగాలా.. అయితే ఈ ఆయిల్ ను వాడండి!