Anushka Vedam Movie : వేశ్య పాత్ర కోసం కథ విని కన్నీళ్లు పెట్టుకున్న అనుష్క.. సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేసింది..!
TeluguStop.com
ఎవరైనా వేశ్య పాత్రలు నటించమంటే స్టార్ హీరోయిన్స్ ఒప్పుకుంటారా ? ఆ పాత్ర చేసిన తర్వాత వారి కెరియర్ ఏమైపోతుందో అనే భయం వారిలో ఉంటుంది.
అప్పటికే హీరోయిన్ గా స్టార్ డం అనుభవిస్తున్న వారు వేశ్య పాత్ర చేస్తే భవిష్యత్తులో కూడా అలాంటి పాత్రలు వచ్చే అవకాశం ఉంటుందని భయం ఖచ్చితంగా ప్రతి ఒక్క హీరోయిన్ కి ఉంటుంది.
అయినా కూడా అలాంటి భయాలు ఏమి పెట్టుకోకుండా వేశ్య పాత్ర అయినప్పటికీ పర్ఫామెన్స్ కి స్కోప్ ఉంది అనే ఒకే ఒక కారణంతో ఒప్పుకున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం అనుష్క( Anushka ) మాత్రమే.
ఆ సినిమా పేరు వేదం.( Vedam Movie ) అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఒక ఐ ఓపెనింగ్ సినిమాగా అందరి దృష్టిని ఆకర్షించేది.
"""/" /
ఈ సినిమాలో వేశ్య పాత్ర కోసం దర్శకుడు ఎవరైనా మామూలు అమ్మాయి దొరకపోతుందా అని అనుకుంటున్నా సమయంలో అల్లు అర్జున్( Allu Arjun ) మాత్రం అనుష్క అయితే చాలా చక్కగా ఉంటుంది అని సజెస్ట్ చేశారట.
కానీ అలాంటి ఒక వేశ్య పాత్ర ఆమె చేస్తుందా అనే సందేహం దర్శకుడు వ్యక్తం చేయడంతో ముందు మీరు కథ చెప్పండి ఆ తర్వాత జరిగేది ఎలాగో జరుగుతుంది కదా అని అన్నారట.
దాంతో ఎలాగోలా ధైర్యం తెచ్చుకొని అనుష్కకి కథ చెప్పడానికి వెళ్లారట.అక్కడికి వెళ్ళగానే ఆమెను చూసి మొదట ఇదొక వేశ్య పాత్ర అని చెప్పగానే ఆమె ఏమనుకుంటుందో అని సందేహంతో చూస్తున్న క్రమంలో పర్వాలేదు కదా చెప్పండి అంటూ ఆమె ఓకే అనడంతో మిగతా కథను పూర్తి చేశాడట క్రిష్.
( Director Krish ) """/" /
కథ మొత్తం విన్న తర్వాత అప్పటికే స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లోనే నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న అనుష్క కన్నీళ్లు పెట్టుకుందట.
ఇలాంటి ఒక పాత్ర మళ్ళీ రాదు ఖచ్చితంగా ఈ పాత్రను నేనే చేస్తాను అని చెప్పారట.
అలాగే ఒక వేశ్య పాత్ర చేసినప్పటికీ ఎక్కడ నెగటివ్ ఇంపాక్ట్ అనేది చూపించకుండా అందరి దృష్టిని ఆకర్షించింది అనుష్క.
ఈ సినిమా హిట్ అవ్వడానికి అల్లు అర్జున్ ఎంత కష్టపడ్డారో అదే రేంజ్ లో అనుష్క క్రేజ్ మరియు నటన కూడా ఈ సినిమాకి ఉపయోగపడింది.
వేశ్య అంటే ఇలాగే ఉంటుందా అని అనిపించేలా ఆమె ఈ పాత్రలో ఒదిగిపోయింది.
ఆ స్టార్ హీరోలకు దిమ్మతిరిగే షాకిచ్చిన పవన్ కళ్యాణ్.. డేట్ విషయంలో మార్పు లేనట్టేనా?