బాలయ్య కోసం అనుష్క వస్తుందా..?

వెండితెర మీద రికార్డులు కొట్టడమే కాదు బుల్లితెర మీద కూడా రికార్డులు షేక్ ఆడిస్తాడు నందమూరి నట సిం హం బాలకృష్ణ.

ఆయన కెరియర్ లో ఫస్ట్ టైం ఓ రియాలిటీ షోకి హోస్ట్ గా చేశారు.

ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ అని వస్తున్న ఈ షో ఓ రేంజ్ లో సూపర్ హిట్ అయ్యింది.

అసలు బాలయ్య హోస్ట్ గా ఓ షో అనగానే ఆడియన్స్ సూపర్ ఎక్సయిట్ అయ్యారు.

అనుకున్నట్టుగానే షో సూపర్ హిట్ అయ్యింది.ఉన్ స్టాపబుల్ సీజన్ 1 బ్లాక్ బస్టర్ కాగా ఇప్పుడు సీజన్ 2కి రంగం సిద్ధమైంది.

సీజన్ 2 మరింత గ్రాండ్ గా.మరింగ భారీగా ప్లాన్ చేస్తున్నారు.

బాలయ్య కూడా అన్ స్టాపబుల్ సీజన్ 2 కోసం ఇంకాస్త జోష్ తెచ్చుకోనున్నారట.

సీజన్ 2లో పాల్గొనబోతున్న సెలబ్రిటీస్ లిస్ట్ ఇప్పటికే సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.

అయితే ఈ లిస్ట్ లో హీరోయిన్స్ కూడా వచ్చి చేరుతున్నారు.అన్ స్టాపబుల్ సీజన్ 2లో స్టార్ హీరోయిన్ అనుష్క పాల్గొనబోతుందని తెలుస్తుంది.

నిశ్శబ్ధం తర్వాత పెద్దగా ఎక్కడ కనిపించని అనుష్క అన్ స్టాపబుల్ 2 తో సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు.

ప్రస్తుతం అనుష్క నవీన్ పొలిశెట్టి సినిమాలో నటిస్తుంది.

కొడుకులతో ఆటోలో ప్రయాణం చేస్తూ చిల్ అవుతున్న నయనతార.. వీడియో వైరల్!