అరుంధతి చేయకపోతే నాకూ అలాంటి పరిస్థితే.. అనుష్క వ్యాఖ్యలు వింటే..?
TeluguStop.com
అరుంధతి సినిమాతో( Arundhati Movie ) ఫుల్ ఫేమస్ అయింది అనుష్క శెట్టి.
( Anushka Shetty ) ఈ ముద్దుగుమ్మ తన ఎంటైర్ కెరీర్‌లో 50కి పైగా సినిమాల్లో చాలా డిఫరెంట్ రోల్స్ పోషిస్తూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.
అరుంధతి సినిమాలో "జేజమ్మ"గా ఆమె చాలా చక్కగా నటించి తెలుగు ప్రేక్షకులకు ఫేవరెట్ హీరోయిన్‌గా మారిపోయింది.
బిల్లా సినిమాలో సూపర్ హాట్ గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది.వేదం సినిమాలో ప్రాస్టిట్యూట్ గా నటించి చాలా పెద్ద రిస్క్ చేసింది.
పంచాక్షరి, నాగవల్లి సినిమాల్లో ఛాలెంజింగ్ రోల్స్ పోషించింది.బాహుబలిలో దేవసేనగా( Devasena ) నటించి యావత్ ప్రపంచాన్ని మెప్పించింది.
రుద్రమదేవి( Rudramadevi ) సినిమాలో టైటిల్ క్యారెక్టర్ చేసి తన నట విశ్వరూపం చూపించింది.
"""/" /
వీటన్నింటి గురించి తెలుసుకుంటే అనుష్క కెరీర్ ఇతర హీరోయిన్లకు చాలా డిఫరెంట్‌గా సాగిందని స్పష్టంగా అర్థం అవుతుంది.
చాలామంది హీరోయిన్లు గ్లామర్ రోల్స్ చేయడానికి పరిమితం అవుతారు.సమంత ఇప్పుడంటే వెయిట్ ఉన్న పాత్రలు చేస్తోంది కానీ ఒకప్పుడు గ్లామర్ డాల్ గానే కనిపించింది.
ఇక కాజల్, తమన్నా, శృతి హాసన్, టబు, స్నేహ, శ్రియ, త్రిష వంటి అనుష్క తోటి హీరోయిన్లు కెరీర్ మొత్తం గ్లామర్ రోల్స్ మాత్రమే చేశారు.
ఇప్పుడు రాణిస్తున్న రష్మిక మందన్న, కీర్తి సురేష్, శ్రీలీల, సంయుక్త మీనన్, మృణాల్ ఠాకూర్ వంటి వాళ్లు కూడా గ్లామర్ షో చేయడానికి మాత్రమే పరిమితమవుతున్నారు.
అనుష్కలాగా అరుంధతి, రుద్రమదేవి వంటి క్యారెక్టర్లు చేయట్లేదు. """/" /
"ఇతర హీరోయిన్లతో పోలిస్తే మీ కెరీర్ చాలా బాగా సాగింది కదా" అని ఇటీవల అనుష్క శెట్టిని ఒక ఇంటర్వ్యూయర్ ప్రశ్నించాడు.
దానికి అనుష్క చాలా చక్కగా ఆన్సర్ ఇచ్చింది."ఒక హీరోయిన్ కెరీర్ అనేది వారికి వచ్చిన ఆపర్చునిటీల మీదే ఆధారపడి ఉంటుంది.
నాకు అరుంధతి సినిమా చేసే అవకాశం వచ్చింది.ఒకవేళ ఆ అవకాశం రాకపోయి ఉంటే నేను కూడా గ్లామర్ రోల్స్‌కి మాత్రమే పరిమితం అయ్యేదాన్ని.
ఇతర హీరోయిన్లకు ఇలాంటి ఆపర్చునిటీ వస్తే నాకంటే మంచిగా యాక్ట్ చేసి ఉండేవారు.
కానీ వారి టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి వారికి అవకాశాలు రాలేదు.ఎవరూ కావాలని గ్లామర్ రోల్స్ చేయరు.
పరిస్థితులు అవకాశాలను బట్టి కెరీర్ ముందుకి సాగిస్తుంటారు" అని అనుష్క శెట్టి క్లారిటీ ఇచ్చింది.
అలాగే తన జీవితంలో మనీ ఎప్పుడూ ప్రయారిటీ కాలేదని ఆమె స్పష్టం చేసింది యోగా టీచర్ గా ఆరేళ్లు పనిచేశానని, అప్పుడు సంపాదించింది తక్కువే అయినా ఆ ఉద్యోగం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నది.
నేడు వరంగల్ సభలో మహిళలకు రేవంత్ చెప్పనున్న గుడ్ న్యూస్ ఏంటి ?