ఎవరు ఏం చెప్పినా అర్జీవి వింటాడు.. ఆయనలో ఉన్న ఆ గుణం చాలా గొప్పది!

టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

కాగా ఈ మధ్యకాలంలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తున్న సినిమాలు అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలుస్తున్నాయి.

ఈ క్రమంలోనే రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన డేంజరస్, కొండా, అమ్మాయి ఇలాంటి సినిమాలు విడుదలైనప్పటికీ అవి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.

కాగా రామ్ గోపాల్ వర్మ మూడు దశాబ్దాల క్రితం శివ సినిమాతో ఏ రేంజ్ లో హిట్ ను అందుకున్నాడో మనందరికీ తెలిసిందే.

ఆ సినిమా తర్వాత 15 ఏళ్ల పాటు ఇండియన్ బాక్సాఫీస్ ని షేర్ చేశాడు రాంగోపాల్ వర్మ.

అంతేకాకుండా రాంగోపాల్ వర్మ తన అండతోనే పదుల సంఖ్యలో ఆర్టిస్టులు, రచయితలు, దర్శకులు, టెక్నీషియన్లను ఎంతోమంది ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.

అంటువంటి వారిలో బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత అయిన అనురాగ్ క‌శ్య‌ప్ కూడా ఒక‌రు.

అనురాగ్ తాజాగా ద‌ర్శ‌కత్వం వహీంచిన సినిమా దొబారా.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా గోపాల్ వర్మ నుంచి తాను ఏ విధంగా ఫిలిం మేకింగ్ నేర్చుకున్నారు అన్నది అనురాగ్ చెప్పుకొచ్చారు.

వ‌ర్మ ద‌గ్గ‌ర ప‌ని చేయ‌డం అంటే ఫిలిం స్కూల్‌కు వెళ్ల‌డ‌మే అని తెలిపారు అనురాగ్.

"""/"/ అలాగే చాలామంది ద‌ర్శ‌కులు త‌మ ద‌గ్గ‌ర ప‌ని చేసే అసిస్టెంట్ల విష‌యంలో ఇన్‌సెక్యూర్ ఫీల‌వుతుంటార‌ని, వాళ్ల‌కు స్వేచ్ఛ ఇవ్వ‌ర‌ని, కానీ వ‌ర్మ అలా కాద‌ని ఎవ‌రు ఏ ఐడియా ఇచ్చినా తీసుకుంటార‌ని, స‌త్య సినిమాల క‌ల్లుమామ పాట‌ను పూర్తిగా అసిస్టెంట్ల‌కు అప్ప‌గించి వారితోనే తీయించారు అని అనురాగ్ తెలిపారు.

కెమెరామ‌న్‌కు ఏదైనా కమ్యూనికేట్ చేయడంలో ఏ వైన సమస్యలు త‌లెత్తితే త‌న‌కో డిజిట‌ల్ కెమెరా ఇచ్చేసి సీన్లు చెప్పి ఎలా తీస్తావో తీయి అని చెప్పి అందులో న‌చ్చిన‌వి ఎంచుకుని కెమెరామ‌న్‌ కు ఇన్‌పుట్స్‌గా ఇచ్చేవాడ‌ని అనురాగ్ చెప్పుకొచ్చారు.

ఈస్ట్ ఆర్ వెస్ట్ ఆర్జీవీ ఈజ్ ద బెస్ట్ అంటూ అనురాగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు.