ఆ స్టార్ హీరో అంటే నాకు చాలా ఇష్టం.. అనుపమ పరమేశ్వరన్ వైరల్ కామెంట్స్!

తెలుగు సినీ ప్రేక్షకులకు స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

అనుపమ తెలుగులో అ ఆ, హలో గురు ప్రేమకోసమే, శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ లాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

అనుపమ కు యూత్ లో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.అనుపమ నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ తన అందం, నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

కాగా అనుపమ త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అఆ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు ఏర్పరచుకున్న అనుపమ ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.

ప్రస్తుతం అనుపమ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.అనుపమ తాజాగా నటించిన చిత్రం కార్తికేయ 2.

టాలీవుడ్ హీరో నిఖిల్ హీరోగా నటించిన ఈ సినిమా ఈనెల 13వ తేదీన విడుదల కానుంది.

ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.

అయితే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుపమ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. """/"/ ఈ సినిమాలో తన పాత్రకు తగిన గుర్తింపు సినిమా రిలీజ్ అయిన తర్వాత లభిస్తుందని, అదేవిధంగా సినిమా కూడా మంచి విజయం అందుకుంటుంది అని అభిప్రాయం వ్యక్తం చేసింది అనుపమ.

అదేవిధంగా ఆమె మాట్లాడుతూ టాలీవుడ్ లో తనకు ఎంతో ఇష్టమైన నటుడు మెగాస్టార్ చిరంజీవి అని చెప్పింది.

మెగాస్టార్ చిరంజీవి సినిమాలు అంటే తనకు ఎంతో ఇష్టమని, అటువంటి టాప్ హీరో సినిమాలో నటించే అవకాశం వస్తే చాలు వెంటనే చేయడానికి రెడీ అని తెలిపింది అనుపమ.

అయితే గతంలో కూడా పలుసార్లు మెగాస్టార్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్న అనుపమ తాజాగా మరొకసారి మెగాస్టార్ పై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ, చిరు సినిమాలలో నటించాలని ఉంది అంటూ తన మనసులోని కోరికను బయట పెట్టేసింది.

ఇద్దరి అమ్మాయిలను సముద్రంలోకి లాగేసిన అలలు.. తర్వాత ఏమైందో చూడండి..