కొత్త హీరో కోసం అనుపమ ఈ రేంజ్ లో రెచ్చిపోయిందేంటి..!

దిల్ రాజు ఫ్యామిలీ నుండి హీరోగా వస్తున్న ఆశిష్ చేస్తున్న రౌడీ బోయ్స్ సినిమా ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేస్తున్నారు.

లేటెస్ట్ గా ఈ సినిమా సాంగ్ రిలీజ్ కోసం రౌడీ హీరో విజయ్ దేవరకొండని గెస్ట్ గా తీసుకొచ్చారు.

ఇక ఈ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ అంటే హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాత్రమే.

ఆశిష్ కొత్త హీరో.అనుపమ తెలుగు, తమిళ, మళయాళ సినిమాల్లో నటించిన హీరోయిన్.

ఈ సినిమాలో అనుపమని తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఆమె వల్ల సినిమాకు చాలా ప్లస్ అవుతుందనే అని చెప్పుకుంటున్నారు.

ముందు క్లాస్, హోమ్లీ లుక్స్ తో కనిపించిన అనుపమ తనలోని ఎనదర్ యాంగిల్ తో అలరిస్తుంది.

రౌడీ బోయ్స్ సినిమాలో అనుపమ ఓ రేంజ్ లో రెచ్చిపోయిందని తెలుస్తుంది.ప్రచార చిత్రాల్లోనే ఆ విషయం అర్ధమవుతుంది.

అనుపమని ఈ సినిమా గ్లామర్ గా చూపించారు.ఆమె కూడా అందుకు సై అన్నట్టు నటించింది.

రౌడీ బోయ్స్ సినిమాకు యూత్ ని ఎట్రాక్ట్ చేసే కీ ఫ్యాక్టర్ అనుపమ పరమేశ్వరన్ మాత్రమే.

అందుకే ఆమెకి భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరి సినిమాలో తీసుకున్నారు.ఈ సినిమాలో ఆశిష్, అనుపమ రొమాన్స్ హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు.

అనుపమ పరమేశ్వరన్ కోసమే రౌడీ బోయ్స్ చూసే ఆడియెన్స్ చాలా మంది ఉంటారు.

మరి అమ్మడికి ఈ సినిమా ఏమేరకు కలిసి వస్తుందో చూడాలి.

ఒడియా అబ్బాయిని పెళ్లాడిన అమెరికన్ వనిత.. ఆమె జీవితం ఎలా మారిందో చూడండి!