అనుపమ నిఖిల్ మధ్య విభేదాలు.. ఇక్కడ హీరో బాధపడుతుంటే హీరోయిన్ ఎంజాయ్ చేస్తుందిగా!
TeluguStop.com
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి మనందరికీ తెలిసిందే.అనుపమ ప్రస్తుతం సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ఇక అనుపమ నటించిన తాజా చిత్రం కార్తికేయ 2.ఇందులో నిఖిల్ హీరోగా నటించిన విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్న చిత్ర బృందం ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉంది.
ఇది ఇలా ఉంటే చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నప్పటికీ హీరోయిన్ అనుపమ మాత్రం ప్రమోషన్స్ లో పాల్గొనడం లేదు.
తన సినిమాకు టైం కేటాయించనంత బిజీగా మారిపోయింది అనుపమ.ఈ క్రమంలోనే నిఖిల్ కు, అనుపమ కు మధ్య విభేదాలు వచ్చాయని అందుకే అనుపమ ప్రమోషన్స్ కు దూరంగా ఉంటుంది అంటూ కూడా వార్తలు వినిపించాయి.
ఇది ఇలా ఉంది తాజాగా అనుపమ సోషల్ మీడియాలో అవి వినిపిస్తున్న వార్తలకు మరింత ఆజ్యం పోసే విధంగా ఇంట్లో సాఫీగా మొక్కలకు నీళ్లు పోస్తూ ఎంజాయ్ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఆ ఫోటోతో సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు నిజమే అని అభిమానులు నమ్ముతున్నారు.
"""/" /
కాగా ఆ అనుమానాలు అన్ని పటాపంచలు చేసే విధంగా ప్రమోషన్స్ లో పాల్గొంది అనుపమ.
తాజాగా కార్తికేయ 2 సినిమా యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది.ఇందులో అనుపమ కూడా పాల్గొంది.
మీడియా అడిగిన అనేక ప్రశ్నలకు స్పందించింది.మొత్తానికి అనుపమ ఇచ్చిన క్లారిటీ పోస్ట్ మీద ఇప్పుడు అందరికీ ఓ క్లారిటీ వచ్చింది.
కార్తికేయ 2 సినిమా యూనిట్‌తో తనకు ఎలాంటి విబేధాలు లేవని, హీరోతోనూ మంచి బంధమే ఉందని ఈ ప్రెస్ మీట్ తో తేలిపోయింది.
క్రిమినల్స్‌ని ఇలా కూడా తీసుకెళ్తారా.. ఈ పోలీస్ వీడియో చూస్తే నవ్వే నవ్వు…