Anupam Kher : 37 రూపాయలతో ముంబైకి వచ్చాడు.. ఇప్పుడు దేశం గర్వించే నటుడు.. అనుపమ్ ఖేర్ సక్సెస్ స్టోరీ ఇదే!

బాలీవుడ్( Bollywood ) ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో క్రేజ్ ను కలిగి ఉన్న ప్రముఖ నటులలో అనుపమ్ ఖేర్( Anupam Kher ) ఒకరు.

కార్తికేయ2 సినిమాతో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు అనుపమ్ ఖేర్ దగ్గరయ్యారు.తెలుగులో అనుపమ్ ఖేర్ కు ఎక్కువ సంఖ్యలో మూవీ ఆఫర్లు వస్తున్నాయి.

అనుపమ్ ఖేర్ యాక్ట్ చేసిన కుచ్ ఖట్టా హో జాయ్( Kuch Khatta Ho Joy ) సినిమా మరికొన్ని రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది.

ఈ సినిమా ఆయనకు 540వ సినిమా కావడం గమనార్హం.నటుడిగా 40 సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న అనుపమ్ ఖేర్ తన కెరీర్ కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నా కెరీర్ లో ఎన్నో అంతర్జాతీయ సినిమాలు చేశానని అలా సినిమాలు చేసే క్రమంలో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నానని అన్నారు.

ఆడియన్స్ విసిరిన రాళ్లతో నిర్మించుకున్న కోట నా జీవితమని అనుపమ్ ఖేర్ కామెంట్లు చేశారు.

"""/" / కెరీర్ పరంగా ఒడిదొడుకులను ఎదుర్కొంటే మాత్రమే లైఫ్ లోని ఆనందం అర్థమవుతుందని ఆయన అన్నారు.

ఎలాంటి అడ్డంకులు లేకుండా లైఫ్ సాఫీగా సాగితే అది ప్రయాణం కాదని అనుపమ్ ఖేర్ చెప్పుకొచ్చారు.

కష్టాలు ఉండాలని ఎత్తుపల్లాలు ఉండాలని అప్పుడే లైఫ్ ను ఆస్వాదిస్తామని ఆయన వెల్లడించారు.

1981 సంవత్సరంలో కేవలం 37 రూపాయలతో ముంబై నగరానికి వచ్చానని అనుపమ్ ఖేర్ తెలిపారు.

"""/" / ప్రస్తుతం ప్రేక్షకులు నా 540వ సినిమా( 540th Movie ) గురించి మాట్లాడుతున్నారని ఇంతకు మించి దేవుడిని ఏం అడగాలని ఆయన కామెంట్లు చేశారు.

కుచ్ ఖట్టా హో జాబ్ సినిమా ఈ నెల 16వ తేదీన రిలీజ్ కానుండగా ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది.

జి.అశోక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారని తెలుస్తోంది.

అనుపమ్ ఖేర్ పారితోషికం సైతం భారీ రేంజ్ లో ఉంది.

వీడియో: రైల్వే ట్రాక్‌పై గొడుగు వేసుకుని దర్జాగా నిద్రపోయాడు.. ట్రైన్ రావడంతో..?