అనుదీప్ ముందు ఉన్నది ఆ ఒక్క ఆప్షన్‌ మాత్రమేనా?

జాతి రత్నాలు( Jati Ratnalu ) సినిమా తో దర్శకుడిగా మంచి పేరు దక్కించుకున్న దర్శకుడు అనుదీప్.

( Director Anudeep ) ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వెంటనే తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ తో ఒక సినిమాను చేసే అవకాశం దక్కించుకున్న విషయం తెల్సిందే.

ఆ సినిమా పై ఉన్న అంచనాల నేపథ్యం లో తెలుగు రాష్ట్రాల తో పాటు తమిళనాట కూడా భారీ ఎత్తున విడుదల చేయడం జరిగింది.

కానీ సినిమా తీవ్రంగా నిరాశ పర్చింది.ఇదెక్కడి సినిమా అంటూ కూడా పెదవి విరిచారు.

జాతిరత్నాలు సినిమా ను చేసిన దర్శకుడు ఈ సినిమాను చేసినట్లుగా అనిపించడం లేదు అంటూ ప్రిన్స్ సినిమా ను( Prince Movie ) చూసిన వారు కామెంట్స్ చేశారు.

ఏం జరిగింది. """/" / ఎక్కడో తేడా కొట్టింది అంటూ అంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఆ సినిమా మినిమం గా వసూళ్లు సాధించినా.పర్వాలేదు అన్నట్లుగా టాక్ ను దక్కించుకున్నా కూడా అనుదీప్ కు వరుసగా ఆఫర్లు వచ్చేవి కావచ్చు.

కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తూ ఉంటే కష్టంగా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇప్పటి వరకు అనుదీప్‌ పలువురు యంగ్‌ హీరోలకు కథ లను విపించేందుకు ప్రయత్నించాడట.

కానీ ఒక్కరు ఇద్దరు మాత్రం కథ ను విని నో చెప్పారు. """/" / ఇతర హీరో లు అసలు అనుదీప్‌ ని దూరంగా పెట్టినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇలాంటి సమయంలో ఆయన ముందు ఉన్న ఒకే ఒక్క ఆప్షన్‌ జాతిరత్నాలు సీక్వెల్‌ అంటూ వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అనుదీప్ దర్శకత్వం లో ఆ మధ్య జాతిరత్నాలు సీక్వెల్‌ రాబోతుంది అంటూ వార్తలు వచ్చాయి.

కానీ కథ ను రెడీ చేసి అశ్వినీదత్ గారిని మరియు నవీన్ పొలిశెట్టిని ఒప్పించడం అంత సులభం కాదు అంటూ స్వయంగా అనుదీప్ పేర్కొన్నాడు.

వారిని మెప్పించే విధంగా స్క్రిప్ట్‌ ను రెడీ చేస్తాడేమో చూడాలి.

కూతురికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన చరణ్… తన కూతురిది తన అభిరుచే అంటూ?